Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

Shreyan Ch by Shreyan Ch
March 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kannada Prabhakar : రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ప్ర‌తి ఒక్క‌రి నోళ్ల‌లో నానిన పేరు క‌న్న‌డ ప్ర‌భాక‌ర్‌. క‌న్న‌డ రంగానికి చెందినా కూడా తెలుగు సినిమా రంగంలో కూడా ప‌దేళ్ల‌కు పైగా ఎన్నో సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు వేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జ్వాల , రాక్ష‌సుడు ,ప‌సివాడి ప్రాణం , కొద‌మ‌సింహం ,జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి లాంటి హిట్ సినిమాల్లో ప్ర‌భాక‌ర్ న‌టించాడు. దాపు 450 సినిమాల్లో నటించిన ఆయన 2001 మార్చి 25న కన్నుమూశారు. అయితే ఇటీవల అతని మూడో భార్య అంజు షాకింగ్ కామెంట్స్ చేశారు.

తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన ప్రభాకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వివాహం జరిగిన సంవత్సరానికే భర్త వదిలి వెళ్లిపోయింది . దానికి కార‌ణాల‌ని తాజాగా చెప్పుకొచ్చింది. అంజు బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా అల‌రించింది. అయితే ఆమెకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 48 ఏళ్ల టైగర్ ప్రభాకర్ ను ఇంట్లో వాళ్లను కాదని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు అర్జున్ ఉన్నారు. కానీ వీరిద్దరి కేవలం సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నారు. అంజు మాట్లాడుతూ.. ” ఉదిరిపూక్కల్ సినిమాతో బాలనటిగా అడుగుపెట్టాను.

Kannada Prabhakar third wife anju told real facts about him
Kannada Prabhakar

నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని నా తల్లిదండ్రులు ఏనాడు కోరుకోలేదు. కానీ అప్పుడు నాకు అవకాశాలు ఎక్కువగా రావడంతో ఇండస్ట్రీలో కొనసాగాను. బాలనటిగా.. కథానాయికగా దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించాను. ఎన్నో చిత్రాల్లో నటించిన నేను కన్నడలో రేంజర్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. మొదటి సినిమాతోనే నాకు ప్రభాకర్ పరిచయమయ్యారు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్ర‌భాక‌ర్ కోసం ఇల్లు వదిలి వెళ్లాను. అప్పటికే కన్నడ ప్రభాకర్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయని, తాను మూడవ దాన్ని అని తెలిసి మోసపోయనన్నారు.

పెళ్లికి ముందు ఈ విషయం చెప్పకుండా..తనను నమ్మక ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నారన్నారు అంజు. తనను చాలా నమ్మానని ,తనతో కలిసి ఏడాది ఉన్నాను అని స్ప‌ష్టం చేసింది అంజు . తన గురించి తెలిసి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. తప్పుడు నిర్ణయం తీసుకుని చాలా కుంగిపోయాను. అతడితో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చేశాను. నా దగ్గరున్న బంగారం కూడా తన దగ్గరే వదిలి బ‌య‌ట‌కు రాగా, ఆ సమయంలో ప్రభాకర్ తో ఓ మాట చెప్పాను. నన్ను చాలా బ్యాడ్ చేశావు. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చెప్పి వ‌చ్చేశాను. తను చనిపోయినా కూడా చివ‌రి చూపు చూసేందుకు వెళ్లలేదు అని అంజు పేర్కొంది.

Tags: anjuKannada Prabhakar
Previous Post

Jayalalitha : డైరెక్ట‌ర్‌తో ఏడేళ్లు ప్రేమ‌.. పెళ్లైన వారానికే న‌ర‌కం చూపించాడ‌న్న జ‌య‌ల‌లిత‌..

Next Post

Niharika Konidela : విడాకుల పుకార్ల నేప‌థ్యంలో ఫొటోలు బ‌య‌ట‌పెట్టిన నిహారిక‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
బిజినెస్

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

by Shreyan Ch
April 27, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.