Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Lokesh : మంగ‌ళ‌గిరిలో లోకేష్‌కి పోటీగా లావ‌ణ్య‌ని దింపిన వైసీపీ.. లోకేష్ ప‌రిస్థితి ఏంటి..?

Shreyan Ch by Shreyan Ch
March 4, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Lokesh : మ‌రికొద్ది రోజుల‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. వైసీపీ కీల‌క స్థానాలు మారుస్తూ ప్ర‌తిప‌క్షాల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే ప్ర‌య‌త్నం చేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముందుగా గంజి శ్రీనివాస్‌కు మంగళగిరి టికెట్‌ కేటాయించింది. కానీ అనూహ్యంగా వైసీపీ విడుదల చేసిన 9వ జాబితాలో మంగళగిరి సీటును గంజి శ్రీనివాస్‌ను తొలగించి.. మురుగుడు లావణ్యకు కేటాయించి షాకిచ్చారు.

ఈ మార్పుపై మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( ఆర్కే ) స్పందించారు.మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆర్కే స్పష్టం చేశారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో నాన్‌ లోకల్‌, బీసీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఆయన నాన్‌ లోకల్‌ అని పేర్కొన్నారు. మంగళగిరి సీటు గెలిపించి జగన్‌కు కానుకగా ఇస్తానని అన్నారు. టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని పునరుద్ఘాటించారు.

Nara Lokesh will he contest from mangalagiri or what
Nara Lokesh

గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించి వైసీపీ తరఫున ఆర్కే గెలిచారు. కానీ వైసీపీలో పలువురు నేతల తీరుతో విసిగిపోయిన ఆర్కే.. వైఎస్‌ షర్మిల వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ విధానాలు నచ్చకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే చేరారు. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు 2004లో మంగళగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గానూ ఎన్నికయ్యారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.అయితే ఈ సారి అసెంబ్లీలో లోకేష్‌ని అడుగుపెట్ట‌వ‌ద్ద‌నే ఉద్దేశంతోనే వైసీపీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన మంగ‌ళ‌గిరిలో అభ్య‌ర్ధి మార్పు ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.

Tags: Nara Lokesh
Previous Post

Actress Laya : ఒక‌ప్పుడు మేటి హీరోయిన్ ల‌య‌.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..!

Next Post

Anshu : ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్ల‌డానికి కార‌ణం చెప్పిన మ‌న్మ‌థుడు హీరోయిన్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.