Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Undavalli Arun Kumar : ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పి మరీ చేశాడు.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
June 17, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Undavalli Arun Kumar : గడిచిన ఏడాది కాలంగా ఈసారి ఏపీ రాజకీయాలు మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.. మళ్లీ జగనేనా, లేదంటే బాబు దూసుకొస్తాడా, కాదు కాదు పవన్ సత్తా చాటుతాడు చూడు ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తరుణం రానే వచ్చింది.. జగన్ సింగిల్‌గా, చంద్రబాబు.. పవన్, మోడీల సపోర్ట్‌తో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి చరిత్ర లిఖించిన జగన్ పార్టీ ఈసారి ప్రతిపక్ష హోదాకే దిక్కులేక అడ్రస్ గల్లంతయ్యింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్‌ పాలన మరోసారి తమకొద్దని ప్రజలు తిరస్కరించారు. కూటమి విజయానికి చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలు, పలు అంశాలు దోహదం కారణం కావొచ్చు.. కానీ వీటికి మించి అసలైన శక్తి పవన్ కళ్యాణ్. నచ్చినా, నచ్చకున్నా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి.

జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న జనసేనాని చెప్పినట్లుగానే వైసీపీని మట్టికరిపించారు. ఈ సారి తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటంలను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. పవన్ అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ . కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంలోనూ పవన్ కీలకంగా మారారు.

Undavalli Arun Kumar comments on pawan kalyan and jagan
Undavalli Arun Kumar

అయితే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ పతనమైపోయింది అనుకుంటే అది టీడీపీ పొరపాటవుతుందని, ఒకవేళ తమ పని అపోయిందని వైసీపీ నేతలు అనుకున్నా అది వారి అపోహే అవుతుందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓటమిపై సమీక్ష చేసుకుని తిరిగి పార్టీని నిలబెట్టాలన్నారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాలన్నారు. అసలు వైసీపీ ఎక్కడా లేకుండా పోయిందని, ఈ ఐదేళ్లలో అయినా పార్టీ నిర్మాణం జరగాలని, అధికార ప్రతినిధులను నియమించుకోవాలని, వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలని చెప్పారు ఉండవల్లి. టీడీపీ దాడులపై వైసీపీ న్యాయపోరాటం చేయాలని సూచించారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ అని చెప్పారు ఉండవల్లి. బీజేపీతో పొత్తులో ఉంటూనే.. చంద్రబాబుని జైలులో కలసి వచ్చిన పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నట్టు సొంతగా ప్రకటించారని, బీజేపీ లేకపోయినా టీడీపీతో కలసి వెళ్లాలనుకున్నారని, కేవలం వైసీపీ ఓటమికోసమే ఆయన పనిచేశారని అన్నారు. కమ్మ-కాపు కలసి పనిచేయడం ఈ ఎన్నికల్లో కూటమికి లాభంగా మారిందన్నారు ఉండవల్లి.

Tags: Undavalli Arun Kumar
Previous Post

Tapsee : బోల్డ్ డ్రెస్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన తాప్సీ.. అమ్మ‌డి అందాల ర‌చ్చ మాములుగా లేదు..!

Next Post

RK Roja : రూ.100 కోట్ల అవినీతి చేసిన రోజా..? అరెస్టు త‌ప్ప‌దా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

by Shreyan Ch
October 24, 2022

...

Read moreDetails
వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

by Shreyan Ch
September 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
ఆహారం

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.