Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Nagarjuna : మొన్న సెక్యూరిటీ తోసేశారు.. ఇవాళ ద‌గ్గ‌ర‌కు తీసుకుని మ‌రీ ఫొటో దిగారు..!

Shreyan Ch by Shreyan Ch
June 28, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Nagarjuna : అక్కినేని నాగార్జున పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్లడు. కొన్నిసార్లు కావాల‌నే కొంద‌రు వివాదాల‌లో నిలిచేలా చేస్తారు. బిగ్ బాస్ స‌మ‌యంలో నాగార్జున‌ని దారుణంగా విమ‌ర్శించ‌డం మ‌నం చూశాం. అయితే ఆ స‌మ‌యంలో నాగార్జున స్పందించింది లేదు. ఇక ఇటీవ‌ల నాగార్జున బాడీగార్డ్ ఆయ‌న అభిమానిని తోసేయ‌డంతో కింద‌ప‌డిపోయాడు. ఆ వీడియో వైర‌ల్ కాగా, పెద్ద వివాదాస్ప‌దం అయింద. అప్పుడు నాగార్జున క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు. నాగార్జున ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో నాగార్జునతో పాటు ధ‌నుష్ నడుచుకుంటూ వ‌స్తుండ‌గా.. అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ముందుకు వచ్చాడు.

దీంతో ఆ అభిమాని విక‌లాంగుడు అని కూడా చూడకుండా సెక్యురిటీ గార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. కిందపడబోయిన అతడు తమాయించుకుని నిలబడ్డాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీంతో మానవత్వం ఏమైపోయింది అంటూ నెటిజన్లు నాగార్జునను విమర్శించారు. అయితే ఈ వివాదం నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇలాంటిది జర‌గ‌కుండా ఉండాల్సింది. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అంటూ నాగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Nagarjuna took photo with a fan
Nagarjuna

ఇక తాజాగా ఆ అభిమానిని నాగార్జున డైరెక్టుగా కలిశారు. మళ్లీ క్షమాపణలు చెప్పారు. అలాగే హగ్ చేసుకొని, ఒక సెల్ఫీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం కుబేరలో నాగార్జున న‌టిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. కింగ్ నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇటీవల జూహు బీచ్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags: Nagarjuna
Previous Post

Kalki 2898AD : క‌ల్కి సినిమా హిట్ అయ్యేది దీపిక జాత‌కం వ‌ల్లే అట‌.. ప్ర‌భాస్ జాత‌కం బాగాలేద‌ట‌..!

Next Post

Kalki 2898AD First Day Collections : క‌ల్కి చిత్రానికి అదిరిపోయే కలెక్ష‌న్స్.. ఓవ‌ర్సీస్ కింగ్‌గా మారిన ప్ర‌భాస్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

No Content Available

POPULAR POSTS

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.