Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

Anemia : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో ర‌క్తం లేన‌ట్లే..!

editor by editor
February 16, 2023
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Anemia : స్త్రీలు, పిల్లల్లో కనబ‌డే ముఖ్యమైన అనారోగ్య స‌మ‌స్య‌ రక్తహీనత. దీన్నే ఎనీమియా అంటారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల రక్తం తక్కువ అవుతుంది. అందులో పౌష్టికాహార లోపం ఒకటి. ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారాల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వ‌ల్ల ర‌క్తం త‌గ్గుతుంది. మరొకటి రక్తం నష్టపోవడం. స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో నులిపురుగుల వల్ల క్రమేపి రక్తాన్ని కోల్పోయి రక్తహీనతకి గురవుతారు. అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే.. రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా. రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో వైద్యుడిచే పరీక్షలు చేయించుకుని ఆ మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. రక్తహీనత ఉన్నవారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది. లేదా బూడిదరంగులోనూ కొందరి చర్మం దర్శనమిస్తుంది. రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కనుక చర్మం రంగు మారుతుంది. ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి.

Anemia symptoms know what to do
Anemia

శరీరంలో తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక.. వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు. రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనతేమో అని అనుమానించాలి. తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి పరీక్షలు చేయించుకుని, ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కారణం అయి ఉండవచ్చు. ఎందుకంటే శరీరంలో తగినంత రక్తం ఉంటే అన్ని భాగాలకు ఉష్ణం సరిగ్గా సరఫరా అవుతుంది. దీంతో శరీరం వేడిగా ఉంటుంది. ఇక రక్తం లేకపోతే శరీరం చల్లగా ఉంటుంది. క‌నుక శ‌రీరం ఎల్ల‌ప్పుడూ చ‌ల్ల‌గా ఉంటున్నా కూడా అనుమానించాలి. ఇది ర‌క్త‌హీన‌త అయి ఉండ‌వ‌చ్చు. ఒక్క‌సారి ప‌రీక్ష‌లు చేయించుకుంటే తేలిపోతుంది. దీంతో ర‌క్త‌హీన‌త ఉందీ.. లేనిదీ.. నిర్దారించుకోవ‌చ్చు. ర‌క్త‌హీన‌త లేక‌పోతే ఓకే. ర‌క్త‌హీన‌త ఉంటే మాత్రం డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే ఐర‌న్ అధికంగా ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. దీంతో ర‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Tags: Anemiahealth tips
Previous Post

Chiranjeevi : సుమ‌న్‌కి ప్రేమ‌తో శుభాకాంక్ష‌లు చెప్పిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

Next Post

MS Dhoni : స్టార్ క‌మెడియ‌న్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ధోని..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
బిజినెస్

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

by Shreyan Ch
April 27, 2024

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.