Alla Ramakrishna Reddy : నీ క‌న్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బెట‌ర్.. వైసీపీకి రాజీనామా చేసిన రామ‌కృష్ణారెడ్డి..

Alla Ramakrishna Reddy : ఏపీలో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి.గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. అలాగే పార్టీకి రాజీనామా చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. స్పీకర్‌కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు.. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ… ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు.

రాజీనామా త‌ర్వాత ఆళ్ల‌..మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో తనను గెలిపించారని.. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో నీతి నిజాయితీతో, ధర్మంగా ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కట్టుబడి పనిచేశానన్నారు. ఓ వైపు బాధగా ఉన్నా సరే.. కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీతో పాటుగా ఎమ్మెల్యే పదవివికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. స్పీకర్‌కు లేఖ అందించాలని వెళ్లానని.. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి రాజీనామా లేఖను అందించి ఆమోదించమని కోరానన్నారు. 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని.. 2004లో సత్తెనపల్లి టికెట్‌ను ఆశించి భంగపడ్డానన్నారు. 2009లో పెదకూరపాడు టికెట్ ఆశించానన్నారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం.. వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేశారని.. ఆహ్వానం మేరకే పార్టీలో చేరానన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని.. త్వరలోనే కారణాలు ఏంటో కూడా చెబుతానన్నారు.

Alla Ramakrishna Reddy resigned to mla seat and ysrcp
Alla Ramakrishna Reddy

ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ తరువాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా.. ఆళ్లను దూరం పెడుతూ వచ్చారని స్థానికంగా చర్చ జరుగుతోంది.. ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. అలాగే గంజి చిరంజీవికి వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే చర్చ జరుగుతోందట.. ఈ అంశం కూడా ఆర్కేను బాధపెట్టింది అంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago