Ambati Rambabu : అంబ‌టికి టిక్కెట్ ఇవ్వ‌రా.. వైసీపీలో తారా స్థాయికి చేరిన రచ్చ‌..

Ambati Rambabu : ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కోవలోకే వస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తరఫున నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

కానీ సీఎం జగన్ మాత్రం ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పారు. అయితే తాను గుంటూరు నుంచి అయితే పోటీ చేయనని, నరసరావుపేట నుంచి అయితనేనే పోటీ చేస్తానని, లేదంటే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ అధిష్టానానికి చెప్పారు. సీఎం జగన్ మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు మాటను వినిపించుకోకుండా పంతానికి పోయారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు సంబంధించి వైసీపీలో పెద్ద పంచాయితీనే నడుస్తోంది. గుంటూరు ఎంపీ స్థానానికి గట్టి పోటీ ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. గుంటూరు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, గుంటూరు టికెట్ ఇవ్వడం కుదరదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది.

Ambati Rambabu reportedly not getting any ticket
Ambati Rambabu

మరోవైపు అంబ‌టికి టిక్కెట్ ఇవ్వొద్దని కొంద‌రు వైసీపీ నాయ‌కులు గ‌ట్టిగా చెబుతున్నారు.స‌త్తెన‌ప‌ల్లిలో అంబ‌టి రాంబాబు సంబ‌రాలు చేసుకోవ‌డం ఒక‌టైతే, ఆయ‌న‌కి అక్క‌డ టిక్కెట్ ఇస్తే మూకుమ్మ‌డి రాజీనామాలు చేస్తామంటూ జ‌డ్పీటీసీలు, ఎంపిటీసీలు. స‌ర్పంచ్‌లు ఇలా ఒక్కొక్క‌రు అంబ‌టి రాంబాబుపై గ‌ట్టిగా ఫైర్ అవుతున్నారు. తాడేప‌ల్లికి చేరిన ఈ పంచాయితీని జ‌గ‌న్ ఎలా సాల్వ్ చేస్తాడా అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago