Anna Canteens Maintenance Cost : అన్న క్యాంటీన్ల‌ను నిర్వ‌హించేందుకు రోజుకు ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా..?

Anna Canteens Maintenance Cost : పేద ప్రజల ఆకలి కష్టాలను తీర్చేందుకు, రోజువారీ కూలీలకు భోజన ఖర్చు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో రాయితీపై అల్పాహరం, భోజనం అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. గ‌త ప్ర‌భుత్వంలో ఇవి మూతప‌డ‌గా, కొత్త ప్ర‌భుత్వంలో తిరిగి ప్రారంభం అయ్యాయి. గుడివాడలో మొదటి అన్న క్యాంటిన్ ను పునఃప్రారంభించగా.. ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో హరేరామ ట్రస్ట్ వీటికి ఆహారం సబ్సిడీపై సరఫరా చేస్తోంది.

2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5కే భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. మళ్లీ అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించబోతుంది. పేద ప్రజలకు ఆకలిని తీర్చు కార్యక్రమం కావడంతో పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం అన్న క్యాంటీన్లకు విరాళాలు అందిస్తున్నారు.

Anna Canteens Maintenance Cost do you know how much it is per day
Anna Canteens Maintenance Cost

అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.2కోట్లకు పైగా విరాళాలు అందాయి. దీంతో ప్రజల ఆసక్తిని గమనించిన ప్రభుత్వం సేకరించిన విరాళాలకు అకౌంట్‌బులిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌బిఐలో ప్రత్యేక ఖాతా తెరిచింది. ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పునఃప్రారంభమైన 100 అన్న క్యాంటిన్ల రోజు వారీ ఖర్చు అక్షరాలా రూ.78.75 లక్షలు అని తెలుస్తుంది. అంటే… నెలకు రూ.19.68 కోట్లని అర్ధ‌మవుతుంది. ఈ ప్ర‌కారం ఏడాదికి రూ.236.25 కోట్లు. ఇక వచ్చే నెలలో ఇప్పటికీ ఉన్న 100 క్యాంటిన్ లకు తోడు మరో 103 క్యాంటీన్లు పెరగనున్నాయని చెబుతుండ‌గా, మొత్తం 203 క్యాంటిన్లకు రోజుకి రూ.1.59 కోట్లు.. నెలకు రూ.39.96 కోట్లు.. వెరసి ఏడాదికి రూ.479 కోట్లు ఖర్చు కానుంద‌ని తెలుస్తుంది. ఈ విష‌యం తెలుసుకొని ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago