Bandla Ganesh : ప‌వ‌న్ చాలా మంచి మ‌నిషి.. ఆయ‌న‌ను అలా అన‌కండి.. బండ్ల గ‌ణేష్ కామెంట్స్‌..

Bandla Ganesh : బండ్ల గణేశ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అత‌ను ప‌వ‌న్ భ‌క్తుడిగా ఎక్కువ పాపులారిటీ పొందాడు. ‘ఈశ్వరా పవనేశ్వరా.. పవరేశ్వరా’ అంటూ పవన్‌ గురించి ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌కి కాస్త దూర‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రిగిన సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారి కూడా బండ్ల గ‌ణేష్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స‌పోర్ట్‌గా నిలుస్తుంటాడు. జనసేన అధినేత గురించి ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యక్తిగత విమర్శలను బండ్ల గణేశ్‌ ఖండించారు. పవన్‌ కల్యాణ్‌ సమాజానికి ఉపయోగపడే మనిషని, ఆయనపై ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సహేతుకం కాదంటూ ఒక వీడియోను విడుదల చేశారు.

‘అందరికీ నమస్కారం.. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు తెప్పిస్తోంది.. నిన్న సీఎం జగన్‌ నాకు ఇష్టుడైన పవన్ కల్యాణ్ గురించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. ఇవి నాకెంతో బాధ కలిగించాయి.. నేను కొన్ని దశాబ్దాల పాటు పవన్‌ కల్యాణ్‌ వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతిమంతుడు. ఎవరు ఎలాంటి కష్టంలో ‘నేనున్నా’ అంటూ ముందుండి సాయ పడే భోళా మనిషి. ఇప్పుడు అలాంటి మనిషి గురించి మీరు (సీఎం జగన్‌) వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జీవితంలో అందరికీ అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని నేను భావిస్తున్నాను.

Bandla Ganesh supportive comments for pawan kalyan
Bandla Ganesh

పవన్‌ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడటం బాధగా ఉంది. మీకు విన్నవిస్తున్నాను. పవన్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి.. దేశం కోసం బతికే మనిషి. ఆయన స్వార్థం కోసం కానీ, స్వలాభం కోసం ఏనాడు పని చేయలేదు. ఆయన హాయిగా షూటింగ్‌లు చేసుకుని సూపర్‌ స్టార్‌ హోదాతో హాయిగా బతకండని నేను తరచూ చెబుతుండే వాడిని. కానీ ఆయన జనాల కోసం ఏదో ఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అన్నింటినీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం జీవిస్తున్నాడు. . రాత్రి, పగలు కష్టపడి.. సంపాదించిన డబ్బుని పార్టీకి, ప్రజలకు ధార పోస్తున్నాడు. ఆయనకు కులాభిమానం లేదు. అందరూ ఒక్కటే అని భావిస్తారు. ఒకవేళ ఆయనకే కులపిచ్చి ఉంటే నన్ను ఇంతలా ఆదరిస్తాడా? నన్నుఈ స్థాయికి తీసుకొస్తాడా? నేను ఈ రోజు అనుభవిస్తుందంతా కూడా పవన్‌ కల్యాణ్‌ పెట్టిన భిక్షే. ఆయన చాలా మంచి వ్యక్తి సార్‌. దయచేసి తెలిసీ తెలియకుండా ఆయన మీద అబాండాలు వేయకండి. నేను జన సేని మనిషిని, కార్యకర్తని ఏ మాత్రం కాదు. కేవలం ఆయనను ప్రేమించే వ్యక్తిని అంటూ బండ్ల‌ గ‌ణేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago