CBI Ex JD Lakshmi Narayana : ప‌వ‌న్ భావాలు తెలిసిన వాడిగా చెబుతున్నా.. ఆ శాఖ బాధ్య‌త‌లు ఇస్తే బాగుంటుంద‌న్న జేడీ

CBI Ex JD Lakshmi Narayana : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఇన్విరాన్‌మెంట్, పారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నారా లోకేశ్‌కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌కి ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఏ ప‌ద‌వి ఇస్తే బాగుంటుంద‌ని చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. దీనిపై ఎవ‌రికి వారు త‌గు సూచ‌న‌లు చేశారు. తాజాగా జేడి ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావాజాలం తెలిసిన వ్య‌క్తిగా నేను చెప్పింది ఏంటంటే మినిస్ట్రి ఆప్ ఎంప్లాయిమెంట్‌. ఆయ‌న‌కి యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారికి ఉన్న శ‌క్తితో ప్ర‌తి మినిస్ట్రితో మాట్లాడి ఉద్యోగాలు ఎలా కేంద్రీకృతం చేయాలి అని ఆలోచిస్తే రాష్ట్రంలోని యువ‌త మరింత వృద్ధి చెందుతారు. ఆయ‌న చెబితే యువ‌త‌లోకి కూడా బాగా వెళుతుంది. యువ‌త‌రానికి ఆయ‌న ఏం చెప్పిన మంచిగా వెళ్లే అవ‌కాశం ఉంది. ఇదొక కొత్త ప్ర‌యోగం అని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. వారు ఏ శాఖ‌లో ఉన్నా కూడా ఆ మంత్రిత్వ వాఖ‌ని ముందుకు తీసుకెళ‌తార‌ని నేను అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు జేడీ.

CBI Ex JD Lakshmi Narayana interesting comments on pawan kalyan
CBI Ex JD Lakshmi Narayana

సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ విధానాల్లో నిలకడ లేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పిన పవన్.. సినిమాల్లో నటించడం నచ్చకే తప్పుకుంటున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామన్న పవన్.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. పార్టీని నడిపేందుకు తనకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని.. సినిమాలే తనకు ఉన్న ప్రత్యామ్నాయమని ఆయన తేల్చి చెప్పారు. అవన్నీ తెలుసుకుని ఉంటే బాగుండేదంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago