Chandra Babu With Family : చంద్ర‌బాబు హ్యాపీ మూమెంట్స్.. జైలు నుండి బ‌య‌ట‌కి వ‌చ్చాక మ‌న‌వ‌డితో..!

Chandra Babu With Family : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో భాగంగా దాదాపు 52 రోజుల పాటు జైలులో ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడు అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకొచ్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.జైలు నుంచి బయట వచ్చిన వెంటనే నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ ఆయన వద్దకు వెళ్లారు. మనవడు దేవాన్షన్‌ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.దేవాన్ష్ ని చూడగానే చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. దేవాన్ష్ తన తాతను హత్తుకున్నాడు.

చంద్రబాబు ఎంతో ప్రేమగా మనవడిని దగ్గరికి తీసుకుకొని, దేవాన్ష్ ని ముద్దాడారు. దేవాన్ష్ వెంట నారా బ్రాహ్మణి, బాలకృష్ణ ఉన్నారు. వారిని కూడా చంద్రబాబు పలకరించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను పలకరించారు చంద్రబాబు. అనంతరం భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసి హృదయాల్లో జైలు వాతావరణం చూసి కలుషితం అవుతుందని భావించిన కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాఖత్ కు దూరంగా ఉంచారు. దీంతో తాతయ్యకు దేవాన్ష్ దాదాపు రెండు నెలలు దూరంగా ఉండాల్సి వచ్చింది.

Chandra Babu With Family photos viral
Chandra Babu With Family

చంద్రబాబు ఎక్కడ ఉన్నా వీకెండ్ లో హైదరాబాద్ కు వస్తుండటంతో తాతయ్యతో ఆటలు, పాటలతో సరదాగా దేవాన్ష్ ఉండేవారని అంటున్నారు. అలాంటిది గత యాభై రెండు రోజుల నుంచి జైలులో ఉండటంతో దేవాన్ష్ ను కుటుంబ సభ్యులు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లకుండా దూరంగా ఉంచారు. జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే చంద్రబాబు తొలి చూపు మనవడు దేవాన్ష్ పైనే పడింది. దేవాన్ష్ కూడా తాతను పెనవేసుకుని కాసేపు అలా నిలుచుండిపోవడం అక్కడ చూసే వారికి కంట తడి పెట్టించింది. దేవాన్ష్ ను హత్తుకున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago