Chandra Mohan : ఆ ఒక్క కారణంగానే చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉందా..?

Chandra Mohan : తెలుగు తెరపై సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ సినీ ప్రయాణం చాలా పెద్దది. ఎన్నో విలక్షణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు చంద్రమోహన్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన తన కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఆయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఉండేది. ఈ సెంటిమెంట్ ఉండడంతో చంద్రమోహన్ తో స్టార్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి క్యూ కట్టేవారు.

ఇప్పటికీ ఆయన అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అప్పట్లో చంద్రమోహన్ కు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి పలుకుబడి ఉందేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చంద్రమోహన్ ఫ్యామిలీ నుండి ఒకరు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పారు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని ఇద్దరు బాగుంటారని.. చిన్నమ్మాయి చాలా బాగుంటుందన్నారు. వాళ్ళని చిన్నప్పుడు హీరోయిన్ భానుమతి చూసి పిల్లలు చాలా బాగున్నారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేద్దామని అడిగినట్లు తెలిపారు.

Chandra Mohan this is the reason his family away from film industry
Chandra Mohan

కానీ తాను సున్నితంగా తిరస్కరించానని అన్నారు. నటుడుగా బిజీగా ఉండడంతో తనకు పిల్లలతో సమయం గడిపేందుకు వీలయ్యేది కాదన్నారు. వాళ్లు లేవకముందే షూటింగ్ కు వెళ్లిపోయేవాడినని చెప్పారు. భార్యా పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ తీసుకువెళ్లినా వాళ్లు తనను గుర్తుపట్టే వాళ్ళు కాదని చెప్పారు. సినిమా ప్రభావం వాళ్ళపై పడకుండా ఇద్దరినీ పెంచాలని అనుకున్నట్టు తెలిపారు. అలాగే పెంచామని ప్రస్తుతం ఇద్దరు బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన అన్నారు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago