CM Revanth Reddy : ప‌ని చేయ‌డం ఇష్టం లేక‌పోతే బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకోండంటూ రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనాధికారులకు స్థానచలనం కలుగుతోంది. మరీ ముఖ్యంగా ఐఏఎస్ , ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. గతంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో ఏడుగురిని బదిలీ చేసింది. ఇందులో ఆరుగురు ఐఏఎస్‌లు ఉండగా..ఒక ఐపీఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్‌లు, ఐఏఎస్‌లతో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

రోజుకు 18 గంటలు పని చేయాలని సూచించారు. అలా పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్‌, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలమనే ఆలోచనతో ఉండాలన్నారు.

CM Revanth Reddy strong warning to officials
CM Revanth Reddy

అధికారులకు మానవీయ కోణం చాలా ముఖ్యమన్నారు. తెలంగాణ డీఎన్ఏలోనే స్వేచ్ఛ ఉందన్న సీఎం.. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా కలిసి పనిచేద్దామన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులకు ఫుల్ పవర్ ఇస్తున్నామన్నారు. అక్రమార్కులు, అవినీతి పరులు, భూకబ్జా దారులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని కోరారు. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago