CM Revanth Reddy : కేసీఆర్‌ని ప‌రామ‌ర్శించిన రేవంత్ రెడ్డి.. అలా చూసి ఎమోష‌న‌లైన సీఎం

CM Revanth Reddy : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, సీటీ స్కాన్‌ కూడా చేసి శస్త్రచికిత్స అవసరం అని అది కూడ చేశారు. కేసీఆర్ కోలువుకోవాల‌ని చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ని రేవంత్‌తో పాటు ప‌లువురు నేతలు ప‌రామ‌ర్శించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, షబ్బర్ అలీ ఉన్నారు.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు రేవంత్.

అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాని చెప్పారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకొని శానససభకు రావాలని.. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. అంతకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి చేరుకొని కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

CM Revanth Reddy visited hospital and met kcr
CM Revanth Reddy

ప్ర‌స్తుతం కేసీఆర్ దగ్గర కేటీఆర్ ,కవిత ,హరీష్ రావు ఉన్నారు. శుక్రవారం జరిగిన తుంటి ఎముక మార్పిడి సర్జరీ విజయవంతం కావడంతో.. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం యశోద ఆసుపత్రి వైద్యులు రెండో రోజు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆయన్ను నిత్యం వైద్య బృందం పర్యవేక్షిస్తోందని చెప్పారు. బెడ్‌ మీద నుంచి లేచి నడవగలుగుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్‌, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ నడుస్తున్నారని తెలిపారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago