CM YS Jagan : సీఎం జ‌గ‌న్‌కు ఓటమి భ‌యం ప‌ట్టుకుందా..?

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి జ‌గ‌న్‌ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చంద్ర‌బాబు బ‌య‌ట ఉంటే ప‌రిస్థితి క‌ష్ట‌మ‌వుతుంద‌ని ఆయ‌న జైలులో పెట్టించారు. ఇప్పుడు ఆయ‌న అనారోగ్యకార‌ణాల వ‌లన బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చాక ప‌రిస్థితులు పూర్తిగా మారాయ‌ని అంటున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే స్కిల్‌ డెవలె్‌పమెంట్‌ పేరుతో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో అక్రమంగా నిర్భందించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడేవారిపై, ప్రభుత్వ తప్పులు ప్రశ్నించిన వారిపై జగన్‌ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయ డం దారుణమని, అక్రమ అరెస్ట్ చేసార‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా క‌నిపిస్తున్నాయి. తెలుగుదేశం నేతలు మునుపెన్నడూ లేని విధంగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఇక, ప్రభుత్వంపై సమరశంఖమే అనే భావన కలుగుతుండగానే ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. టీడీపీలో ఉత్సాహం ఏ మాత్రం గిట్టని వైసీపీ సర్కార్ మాత్రం దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబు విడుదల సందర్భంగా ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీలు, ప్ర‌సంగాలు వంటి వాటితో శాంతిభ‌ద్ర‌త‌ల‌కి విఘాతం కలుగుతుంద‌ని, అందుకే చంద్ర‌బాబుని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

CM YS Jagan may be got fear about his future
CM YS Jagan

చంద్రబాబు బయట ఉన్నా బెయిల్ షరతుల పేరిట ఆయన్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తే.. ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్ధమవుతుంది. స్కిల్ కేసులో ఈసారి కోర్టు తప్పకుండా చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందని భావించిన సీఐడీ.. అప్పటికప్పుడు మద్యం కేసును తెరపైకి తెచ్చింది. ఇలా చంద్ర‌బాబుని ఎదుర్కోలేక జ‌గ‌న్ కుట్ర‌లు ప‌న్నుతున్నాడ‌ని కొంద‌రు టీడీపీ నాయ‌కులు చెప్పుకొస్తున్నారు. నవంబర్‌ 1 నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రారంభమవుతుందని, నియంత పాలనపై క్షుణ్ణంగా చెప్పి ప్రజలను చైతన్య పరిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Shreyan Ch
Published by
Shreyan Ch
Tags: cm ys jagan