Dhoni And Ram Charan : 13 ఏళ్ల త‌ర్వాత ఒకే ఫ్రేములో రామ్ చ‌ర‌ణ్‌, ధోని.. ఇలా క‌ల‌వ‌డానికి కార‌ణం ఏంటి?

Dhoni And Ram Charan : ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టార్లు ఇద్దరినీ ఒక్క ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందంతో ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. బెస్ట్ పిక్ ఆఫ్ ద డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్, ఎంఎస్ ధోని కలిసి మంగళవారం ఓ యాడ్ చేశారు. షూటింగులో వాళ్ళిద్దరూ పాల్గొన్నారు. అయితే… ఆ యాడ్ ఏమిటి? అందులో చరణ్, ధోని పాత్రలు ఎలా ఉంటాయి? ఎప్పుడు విడుదల చేస్తారు? వంటివి ప్రస్తుతానికి సస్పెన్స్.

ధోనితో రామ్ చరణ్ యాడ్ చేయడం ఇదేమీ తొలిసారి కాదు. సుమారు 13 ఏళ్ళ క్రితం టీవీలో, సోషల్ మీడియాలో టెలికాస్ట్ కోసం ఓ యాడ్ చేశారు. కూల్ డ్రింక్ కంపెనీ పెప్సీ కోసం అప్పుడు కలిశారు. మరి, ఇప్పుడు చేసిన యాడ్ ఏమిటి? అనేది త్వరలో తెలుస్తుంది. ఇక గ‌త కొద్ది రోజులుగా అయ్య‌ప్ప మాల‌లో ఉన్న రామ్ చ‌ర‌ణ్ ఈరోజు ఉదయం రామ్ చరణ్ ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక టెంపుల్ ను సందర్భించారు. అయ్యప్ప మాల విరమణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది చరణ్ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. వినాయకుని దర్శనం అనంతరం.. శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Dhoni And Ram Charan met video viral
Dhoni And Ram Charan

ఇక ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉంది. శంకర్ ‘ఇండియన్ 2’పై ఫోకస్ పెట్డడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. త్వరలో షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago