IND Vs ENG Semi Final 2022 : ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డే సూచ‌న ఉందా..?

IND Vs ENG Semi Final 2022 : టీ 20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. బుధవారం నుంచే సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నేడు పాకిస్తాన్ – న్యూజిల్యాండ్ తలపడుతుండగా.. రేపు (గురువారం) అడిలైడ్ ఓవల్‌లో జరిగే రెండవ సెమీఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం (నవంబర్ 13) మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. ఇండియా vs ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు ముందు అడిలైడ్ వాతావరణ సూచన మరియు అడిలైడ్ ఓవల్ పిచ్ రిపోర్ట్ కు సంబంధించిన వివరాలు ఓసారి చూద్దాం..

అడిలైడ్ వాతావరణ సూచన: అడిలైడ్ వాతావరణ రాడార్ కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 17 డిగ్రీలు ఉంటుందని, గరిష్టంగా 24 డిగ్రీల వరకు వెళ్తుందని చెబుతోంది. తెల్లవారుజామున జల్లులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రేపు 40 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ మధ్యాహ్నం మ్యాచ్ సమయానికి వాతావరణం అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే సిటీ అంతటా 20 కి.మీ వేగంతో సౌత్‌ర్లీ ఫ్యానింగ్ మేఘాలను దూరం చేస్తుంది.

IND Vs ENG Semi Final 2022 weather forecast and match details
IND Vs ENG Semi Final 2022

అడిలైడ్ పిచ్ నివేదిక: కొత్తగా వేసిన పిచ్ అయినందున బౌలర్లకు, బ్యాటర్లకు సమంగా అనుకూలిస్తుంది. అడిలైడ్ ఓవల్ పిచ్‌ మొదట బౌలర్లకు అనుకూలించినా క్రమంగా బ్యాటర్లకు ఈ పిచ్ అనుకూలంగా మారవచ్చు. దీంతో రేపు పరుగుల వరదకు అవకాశం ఉంది. ఇరుజట్లు భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం ఉంది. మ్యాచ్ సినారియో: ఇది సెమీస్ కాబట్టి అందరిలో ఆసక్తి రెట్టింపవుతుంది. ఇందులో గెలిచి జట్టు నవంబర్ 13న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే ఫైనల్ కు చేరుకుంటాయి. పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరిగే మొదటి సెమీస్ విజేతతో తలపడతాయి.

జట్టు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ. స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, టైమల్ మిల్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అలెక్స్ హేల్స్. స్టాండ్‌బై ప్లేయర్స్: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago