Isro Chairman Somanath : ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్ జీతం ఎంతో తెలుసా..?

Isro Chairman Somanath : చందమామపై చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం 130 కోట్ల భారతీయుల్లో ఆనందం వెల్లువిరిసిన ఆనందం అంతా ఇంతా కాదు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, సాంకేతిక నిపుణులు అహర్నిశలు శ్రమించారు. బుధవారం ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టగానే సంవత్సరాలుగా పడిన శ్రమ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన సిబ్బందితో కలిసి మంచీ మ్యూజిక్ బీట్ పెట్టుకొని డ్యాన్సులతో హోరెత్తించారు. సోమనాథ్ స్టెప్పులు వేస్తూ హుషారుగా వెస్ట్రన్ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్‌.. ఏరోస్పేస్ ఇంజనీర్, రాకెట్ సాంకేతిక నిపుణుడు. జనవరి 2022లో, కె. శివన్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. లాంచ్ వెహికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ డిజైన్, స్ట్రక్చరల్ డైనమిక్స్, పైరోటెక్నిక్‌ల రంగాలలో అతని కృషికి మంచి పేరు వచ్చింది. సోమనాథ్ ఎర్నాకులంలోని మహారాజా కళాశాలలో తన ప్రీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను, TKM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, క్విలాన్, కేరళ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని డైనమిక్స్,కంట్రోల్‌లో స్పెషలైజేషన్‌తో పొందాడు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా జనవరి 2018 లో VSSC డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2022 జనవరి 15న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించారు.

Isro Chairman Somanath do you know about the salary of him
Isro Chairman Somanath

ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌ జీతంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. నెలకు 2.5లక్షల రూపాయల ఆయన ఇన్‌కమ్‌గా తెలుస్తోంది. అది కూడా బెసిక్‌పే..వాటితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. చంద్రయాన్-3 ప్రయోగంలో ఇస్రో ప్రధానంగా మూడు లక్ష్యాలు పెట్టుకుంది. అందులో మొదటిది.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం. రెండవది.. చంద్రుడి ఉపరితలం మీద రోవర్‌ దిగి సంచరించడం. మూడవది.. ల్యాండర్,రోవర్‌లు కలసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడం. ఈ మూడు లక్ష్యాలలో మొదటిది అయిన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి.. ప్రయోగాలు మొద‌లు పెట్టింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago