Jr NTR Kannada Speech : క‌న్న‌డ‌లో ఎన్‌టీఆర్ ఎంత బాగా మాట్లాడాడో తెలుసా.. రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం ఖాయం.. వీడియో..

Jr NTR Kannada Speech : మొదటి నుంచి కన్నడలో విడుదలవుతున్న ఇతర భాషల సినిమాలపై కన్నడ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆగ్రహంతో ఉన్నారు. ఇతర భాషా చిత్రాలను వారి కన్నడ భాషలో విడుదల చేయకుండా కన్నడ హీరోలతో డబ్ చేసి అక్కడ విడుదల చేయాలన్నది వారి ప్రధాన వాదన. కానీ నిన్న నవంబర్ 1న బెంగళూరులో జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కన్నడ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాడు. తారక్  కన్నడలో అనర్గళంగా మాట్లాడాడు. ఎన్టీఆర్  స్వచ్ఛమైన కన్నడ భాషలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.  ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్ కి కన్నడ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో కన్నడ సూపర్ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్నను ప్రదానం చేయటం జరిగింది .

Jr NTR Kannada Speech everybody surprised by his words video
Jr NTR Kannada Speech

ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట తీరు, ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పునీత్ రాజ్ కుమార్ మీద ప్రేమను తన మాటల్లో వ్యక్తపరిచాడు ఎన్టీఆర్. అలా ఎన్టీఆర్ మాటలు, చేతలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. నేను ఇక్కడికి అతిథిగా కాదు అప్పుకి స్నేహితుడిగానే వచ్చాను. ఎవరైనా కుటుంబ పెద్దల నుంచి ఇంటి పేరునో, వారసత్వాన్నో పొందుతారు. కానీ మంచి వ్యక్తిత్వాన్ని మనమే సంపాదించుకోవాలి. అహంకారం లేని వ్యక్తిత్వం, ఎప్పుడూ చిరునవ్వుతో యావత్ కన్నడ రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అందుకే ఈ అవార్డు ఆయనకు దక్కింది. అతని నవ్వులో ఉన్న సంపద ఇంకెక్కడా దొరకదు అని అన్నారు.

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో గొప్ప సూపర్ స్టార్, ఒక గొప్ప కొడుకు, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప ఫ్రెండ్, గొప్ప యాక్టర్, సింగర్, డ్యాన్సర్ వీటన్నిటిని  మించి ఒక గొప్ప మానవతావాది అని ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.  నా ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే పునీత్ రాజ్ కుమార్ అని అన్నారు ఎన్టీఆర్. పునీత్ గురించి ఎన్టీఆర్ స్పీచ్ మొత్తం కన్నడలో మాట్లాడటం విశేషం. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులతో పాటు,  రజనీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అనర్గళంగా కన్నడ భాషలో మాట్లాడటం చూసిన కన్నడ ప్రజలతో పాటు, రజనీకాంత్ సైతం ఎన్టీఆర్ మాట తీరుకు ఫిదా అయిపోయారు.

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago