Kesineni Nani : చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేశినేని నాని.. త‌ర్వాత ఏమైందంటే..!

Kesineni Nani : టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఏపీలో అధికారం కోసం చంద్రబాబు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు కూడా మోసం చేస్తారని, తన కొడుకు నారా లోకేష్‌ను సీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.రెండు సార్లు టీడీపీ ఎంపీగా గెలిచానని, విజయవాడలో కార్పొరేషన్‌తో పాటు సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తాను గెలిపించానని వెల్లడించారు.

తనను టీడీపీ నుంచి దూరం చేస్తే వైఎస్‌ జగన్‌ అక్కున చేర్చుకున్నారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని జోస్యం చెప్పారు. అమరావతి పేరిట భూములను తీసుకుని రైతులను మోసం చేశారని ఆరోపించారు. 30 సంవత్సరాలు అయినా అమరావతి అభివృద్ధి చెందదని బాబుకు వివరించానని, బెజవాడలో ఎయిర్‌పోర్టు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో గందళగోళ పరిస్థితులే ఉంటాయని పేర్కొన్నారు. చంద్రబాబు విజయవాడతో పాటు విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాలను ముంచేశారని ఆరోపించారు.

Kesineni Nani sensational comments on chandra babu
Kesineni Nani

చంద్రబాబు నాయుడు గురించి ఎవరిని అడిగినా చెబుతారని మోసం చేయడం బాబు నైజం అన్నారు. తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు పార్టీలో చేరిన విషయంలో తన ప్రమేయం లేదని కేశినేని నాని స్పష్టం చేశారు. తాను చేరడానికి ముందే స్వామిదాసుతో పార్టీ సంప్రదింపులు చేస్తోందన్నారు. టీడీపీ నుంచి తాను ఎవరిని వైసీపీలోకి ఆహ్వానించలేదన్నారు.తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేనికి నానికి బిగ్ షాక్ ఇస్తున్నారు ఆయన అనుచరులు. మీడియా వేదికగా 60 శాతం టీడీపీ శ్రేణులు తనతో పాటే వస్తారని ప్రకటించిన నాని.. గట్టి ఝలక్ ఇస్తున్నారు. తామెవరం నీ వెంట రాలేం అంటూ తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో కేశినేని నాని ఖంగుతిన్నారట.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago