LPG Gas Cylinder : గ్యాస్ సిలిండ‌ర్ వాడుతున్నారా.. అయితే మీ అకౌంట్లోకి రూ.2400..

LPG Gas Cylinder : కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌ని ఆక‌ర్షిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఉజ్వల యోజన పథకం కింద పేదలకు వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు అందించింది. ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని మరో 8 నెలల పాటు పొడిగించింది. పథకం లబ్ధిదారులకు ప్రతి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌ సాధారణ కస్టమర్లకు రూ.855‌కు లభిస్తుండ‌గా, ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇవ్వ‌నుంది. అంటే సిలిండర్ వారికి రూ.555కే లభిస్తోంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వ‌ల‌న‌ లబ్ధిదారులకు వచ్చే ఎనిమిది నెలలు (2025 మార్చి) వరకు ప్ర‌తి నెల 300 రూపాయ‌ల స‌బ్సిడీ వ‌స్తుంది. అలా వారికి 8 నెలలకి మొత్తం రూ. 2400 అకౌంట్లో డబ్బులు పడనున్నాయ్. వీరికి ఏడాదికి 12 రీఫిల్స్ (సిలిండర్లను) సరఫరా చేస్తారు. ఈ పథకం కింద 14.2 కిలోల సిలిండర్‌పై మాత్రమే కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇస్తోంది. ఆగస్టు నుంచి భారత్‌లో గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలను జారీ చేసింది.

LPG Gas Cylinder consumers good news how they can avail this 2400 benefit
LPG Gas Cylinder

దీని ప్రకారం కేవైసీ లేకుండా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇంట్లో సిలిండర్‌ను పంపిణీ చేసేటప్పుడు వినియోగదారుల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాలని కూడా పేర్కొంది. ఎల్‌పీజీ సిలిండర్ల డోర్-స్టెప్ డెలివరీ వ్యక్తులు మీ బయోమెట్రిక్‌లను తనిఖీ చేస్తారు. ఆధార్ వివరాలు మీవేనా అని తనిఖీ చేస్తారు. ఫలితంగా 80% ఉద్యోగులకు బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరికరాలు అందించారు. అంతే కాకుండా ఆధార్ కేవైసీ చేయకుంటే గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది. కట్టెల పొయ్యి బాధ నుంచి మహిళల ఆరోగ్యం కాపాడటం, పరిశుభ్రమైన వంట వైపు పేద కుటంబాలను తీసుకురావడం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఉజ్వ‌ల యోజ‌న ప‌థ‌కం తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago