Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!

Mallu Bhatti Vikramarka : తెలంగాణ సీఎం ఎవ‌రు అవుతార‌నే అనుమానాలు అంద‌రిలో ఉండ‌గా, దానికి ఎట్ట‌కేలకి ఓ క్లారిటీ వ‌చ్చింది. రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేయ‌గా, సీనియ‌ర్ నాయ‌కుడు భట్టి విక్ర‌మార్క‌ని డిప్యూటీ సీఎంగా ఆఫ‌ర్ ఇచ్చారు . కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మధిర నుండి మరో సారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్‌పై 35,190 ఓట్ల తేడాతో భట్టి గెలుపొందారు. సీఎం పదవి ఇస్తే భాద్యతతో పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే భ‌ట్టికి సీఎం ఆఫ‌ర్ ద‌క్కుతుందని అంద‌రు అనుకున్నా,అది జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యంలో భ‌ట్టిని మీడియా ప్ర‌శ్నించారు.

డీకే శివ‌కుమార్‌ని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న ఏమన్నారు, మీకు అవ‌కాశం ఎందుకు ఇవ్వ‌లేదు అని భ‌ట్టిని ప్ర‌శ్నించ‌గా, దానికి భ‌ట్టి మాట్లాడుతూ ఆ విష‌యాలు త‌ర్వాత మాట్లాడ‌తాన‌ని అన్నారు. ఇక త‌మ‌ని గెలిపించిన ప్రతి ఒక్క‌రికి భ‌ట్టి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కాంగ్రెస్ నాయ‌కులకి కూడా భ‌ట్టి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై భట్టి మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్‌కు మాత్రమే పెటెంట్ ఉందని చెప్పారు.

Mallu Bhatti Vikramarka reply to reporter question about cm post
Mallu Bhatti Vikramarka

రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి కావడానికి కూడా వైఎస్సార్ కారణమని భట్టి అన్నారు. ఆయన హయాంలో తెలంగాణలో నిర్మితమైన ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు కరెంట్ వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కరెంట్‌ను ముట్టుకున్నా, కాంగ్రెస్‌ను ముట్టుకున్నా ఎలా మాడిపోతారో ఇప్పుడు చూశారు కదా? అని అన్నారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేశానని, గ్రామస్థాయిలో ప్రజల కష్టాలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్షంగా చూశానని భట్టి పేర్కొన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago