Manchu Manoj Wedding Video : మంచు మ‌నోజ్ పెళ్లి వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్.. విష్ణుకి ఒకే ఫ్రేమ్ కేటాయించారుగా..!

Manchu Manoj Wedding Video : ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ముఖ్యంగా మంచు మ‌నోజ్ షేర్ చేసిన వీడియో ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. ‘అన్నయ్య అరాచకం’ అంటూ మనోజ్ ఏకంగా ఓ వీడియోనే పోస్ట్ చేయ‌గా, మోహన్ బాబు చొరవతో తర్వాత ఆ వీడియో డిలీట్ అయింది.అయితే అన్నదమ్ముల మధ్య ఈ స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోంది కాబట్టే, ఆ వీడియోని మంచు మ‌నోజ్ అలా రిలీజ్ చేశాడ‌ని చెప్పుకొస్తున్నారు. అయితే మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం త‌న రెండో భార్య‌తో క‌లిసి స‌ర‌దాగా సంతోషంగా గ‌డుపుతున్నాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డిని మ‌నోజ్ వివాహం చేసుకోగా, ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు సమక్షంలో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

మంచు లక్ష్మీ ఈ వేడుక‌కి వేదిక కాగా, ఇటీవలే వెన్నెల కిషోర్‌ హోస్ట్‌గా చేస్తున్న అలా మొదలైంది ప్రోగ్రాంకు కూడా ఈ జంట వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మనోజ్-మౌనికల వివాహనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పెళ్లి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అంతా కలిపి, ఓ కవర్ సాంగ్ లాగా ‘ఏం మనసో ఏం మనసో’ అంటూ సాగే సాంగ్ విడుద‌ల చేశారు. అనంత శ్రీరామ్ ఈ పాటను రాయగా.. అచ్చు రాజమని పాడి, సంగీతం అందించాడు. ఇందులో పెళ్లికి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌న్నీ చూపించారు.

Manchu Manoj Wedding Video viral on social media
Manchu Manoj Wedding Video

హల్దీ ఫంక్షన్‌, రింగులు మార్చుకోవడం సహా పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చూపించారు. ఈ వీడియోలో మోహన్‌బాబు, మౌనిక రెడ్డి కళ్లు తుడవడం. హత్తుకోవడం వంటివి కాస్త ఎమోషనల్‌గా క‌నిపించాయి.. ఇక వీడియో చివర్లో ఇది శివుని ఆజ్ఞ అంటూ మనోజ్‌, భూమా మౌనికారెడ్డి, ఆమె తనయుడి చేతులు ఒకరిపై ఒకరు వేసుకుని ఉండటం వీడియోకే హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ వీడియోలో మంచు విష్ణుకు దక్కిన ప్రాధాన్యం గురించి చర్చకొచ్చింది. ఓ హీరోకు పెళ్లి వీడియోలో ఇచ్చిన రన్ టైమ్ ఇంతేనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago