MP Gorantla Madhav : కాంగ్రెస్‌లోకి గోరంట్ల‌.. ఏర్పాట్లు చేసుకుంటున్నాడా..?

MP Gorantla Madhav : అధికార వైసీపీలో ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఐ ప్యాక్‌‌తో పాటు, సొంత సర్వేల్లో వెనుకపడిన ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. పైగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ జాగ్రత్త వహిస్తున్నారు. ఇటీవ‌ల పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ గోరుంట్ల మాధవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకొనొక సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డితో గొడవకు కూడా దిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గోరుంట్ల మాధవ్‌ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

తాజాగా దీనిపై గోరుంట్ల మాధవ్‌ తనదైనశైలిలో స్పందించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని.. పార్టీ నాకు తల్లి లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడ మాట్లాడలేదని.. సోషల్ మీడియాలో నాపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని గోరుంట్ల మాధవ్‌ తెలిపారు. టికెట్ విషయంలో తాను పార్టీ పెద్దలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని.. టికెట్ వచ్చిన రాకపోయిన పార్టీలోనే కార్యకర్తగా కొనసాగుతానని గోరుంట్ల మాధవ్‌ పేర్కొన్నారు. వైసీపీలోనే ఉండి చావో రేవో తేల్చుకుంటానని చెప్పి సంచలన కామెంట్స్ చేశారు.

MP Gorantla Madhav reportedly eyeing to join congress
MP Gorantla Madhav

సజ్జల పార్టీలో అందరితో ఓర్పుతో మాట్లాడతారని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.సజ్జలతో గొడవ పడినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.వైసీపీలో కలహాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.సీఎం జగన్ ఆదేశాలు తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. అందరిని ప్రేమగా చూసుకునే ఆయనతో తాను గొడవ పడినట్లు, జగన్ తో పెద్దిరెడ్డి వాగ్వాదం చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని మండిపడ్డారు. ఆయా సంస్థలు కడుపుకి అన్నం తిని విషం కక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సమీకరణలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని, కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తోందని చెప్పారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago