Murugudu Lavanya : మంగ‌ళగిరిలో లోకేష్‌పై పోటీ చేసే లావ‌ణ్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే మ‌తి పోత‌ది..!

Murugudu Lavanya : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం మ‌రెన్నో రోజులు లేదు. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌ను్న్నాయి. జూన్ 4న ఫ‌లితాలు రానున్నాయి. అయితే అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కుప్పం, హిందూపురం విషయంలో ప్రత్యేకంగా వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది. ఇదే సమయంలో మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే ఇటీవలే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించ‌డంతో ఆమెపై అంద‌రిలో ప్ర‌త్యేక ఫోక‌స్ పెరిగింది.

జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా మంగళగిరి నుంచి మురుగుడు లావణ్యను సమన్వయకర్తగా నియమితులు చేయ‌డంతో ఆమె గురించి తెలుసుకోవాల‌ని చాలా మంది ఎదురు చూస్తున్నారు. 2024లో మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఢీ కొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరా, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటా విషయాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే.. ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడులు. ఇక కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1987లో వైఎస్సార్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు.

Murugudu Lavanya from mangalagiri with ysrcp facts to know
Murugudu Lavanya

ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల విషయానికి వస్తే.. ఆమె 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. అలా మొత్తంగా లావణ్యకు అటు పుట్టిల్లు, ఇటు అత్తగారి ఇళ్లు రాజకీయ నేపథ్యం కలిగింది. అలానే ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుంది. మొత్తంగా మరోసారి లోకేశ్ ను ఓడించేందుకు లావణ్యను వైఎస్సార్ సీపీ బరిలో నిలిపిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఈ సారి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago