Nadendla Manohar : తిరుప‌తి ఎయిర్ పోర్ట్‌లో ప‌వ‌న్ ని కారు దిగ‌నివ్వ‌కుండా హైడ్రామా.. ఫైర్ అయిన నాదెండ్ల‌..

Nadendla Manohar : తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోగా మంచి సక్సెస్ తో సాగుతున్న సమయంలో 2014 మార్చిలో ‘జనసేన’ పార్టీ స్థాపించాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో వైసీపీపై సంచ‌న‌ల ఆరోప‌ణలు చేసి వార్త‌ల‌లో నిలిచారు. ఇక శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి ధర్నా చేస్తున్న సమయంలో సీఐ అంజూ యాదవ్ అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.

తిరుపతికి వెళ‌లి సీఐ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రేణిగుంటకు చేరుకొని అక్కడ నుంచి జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా జిల్లా ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్ట్‌లో పెద్ద హైడ్రామా నెల‌కొంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడ‌ని తెలిసి అక్క‌డికి భారీగా అభిమానులు చేరుకున్నారు. ఇక పోలీసులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని కారు దిగ‌నివ్వకుండా కొంత సేపు అడ్డుప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. ఆ స‌మ‌యంలో మ‌నోహ‌ర్ కారు నుండి దిగి, పోలీసుల‌పై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Nadendla Manohar angry for not getting down pawan kalyan
Nadendla Manohar

ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ ఆఫీసుకు చేరుకున్న స‌మ‌యంలో ఓ విచిత్ర దృశ్యం చోటుచేసుకుంది. ఇలా కూడా శాలువా కప్పుతారా అని ఆశ్చర్యపరిచే రీతిలో… ఓ అభిమాని క్రేన్ కు వేలాడుతూ వచ్చి కారులో నిలుచుని ఉన్న పవన్ కు శాలువా కప్పి, పూల దండ వేసి సత్కరించాడు. అభిమాని సాహసం చూసిన పవన్ కూడా కాస్త విస్మయానికి గురయ్యారు. అదే సమయంలో, ఆ అభిమాని వేలాడిన‌ తీరుకు ఆయన నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ అభిమానిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago