Nandamuri Balakrishna : నామినేషన్ వేయ‌క ముందు బాల‌య్య అదిరిపోయే కామెడీ..!

Nandamuri Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ న‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా స‌త్తా చాటుతున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు స‌త్తా చాటిన బాల‌య్య ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ దాఖలు చేశారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన హిందూపూర్ లో ప్రయత్నిస్తున్నారు. భారీ ర్యాలీతో బయలుదేరిన నందమూరి బాలకృష్ణ తొలుత సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. ముందుగా హిందూపురంలోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి నందమూరి బాలకృష్ణ నామినేషన్‍కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

నామినేషన్ కార్యక్రమానికి హిందూపురంలో టీడీపీ కార్యకర్తలతో పాటు బాలకృష్ణ అభిమానులు పెద్దయెత్తున తరలి వచ్చారు. వారితో బాల‌య్య చేసిన కామెడీ ప్ర‌తి ఒక్కరిని న‌వ్వించింది. మ‌న‌కు ఎండ అంటే భ‌యం లేదు. న‌న్నే చూసి ఎండ‌కు భ‌యం. ఎప్పుడు స్ట్రెయిన్ కాను. షూటింగ్స్ స‌మ‌యంలో కూడా నేను కార‌వ్యాన్‌లో ఎక్కువ‌గా కూర్చోను అని అన్నారు బాల‌య్య‌. ఇక ఫ్యాన్స్ అయితే రోజురోజుకి మీరు ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా మారుతున్నారంటూ ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. బాల‌య్య ఫ్యాన్స్ తో చేసిన సంద‌డి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎప్పుడు చిర్రుబుర్రులాడే బాల‌య్య ఇలా ఫ‌న్నీగా ఉండ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు.

Nandamuri Balakrishna comedy before his nomination
Nandamuri Balakrishna

ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరుగనున్న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇటీవ‌ల ప్రారంభమైంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26వ తేదీన నామినేషన్లు పరిశీలన చేయనున్నారు. అలాగే 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కొన్నారు. ఇక ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago