Paruchuri Gopala Krishna : సినిమా హిట్‌కి పెద్ద హీరోలు అక్క‌ర్లేదు.. బ‌లగం మూవీపై ప‌ర‌చూరి ఆస‌క్తిక‌ర కామెంట్స్..

Paruchuri Gopala Krishna : చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద హిట్ సాధించిన చిత్రం బ‌లగం. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటీ నటులు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ విలేజ్ డ్రామా ఫామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో కదిలించింది. ఈ సినిమాకి అంతర్జాతీయ లెవెల్లో పలు అవార్డులు వరుసగా వస్తూ ఉండడం విశేషం. ఇండో ఫ్రెంచ్ మూవీ ఫెస్టివల్ లో ఈ సినిమాకి క్రిటిక్స్ ఛాయిస్ లో వేణుకి అలాగే హీరో ప్రియదర్శికి బెస్ట్ పెర్ఫామర్ గా రెండు అవార్డులు దక్కాయి. ఈ క్ర‌మంలో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

బ‌లగం సినిమాని ప‌లువురు రాజ‌కీయ నేత‌లు కూడా వీక్షించి సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. బండి సంజయ్ తోపాటు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు. చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు 200 మంది వరకు బలగం సినిమా చూశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో ఈ సినిమాను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత విడిపోయిన ఎన్నో కుటుంబాలు కలుస్తున్నాయి. తెలంగాణ సంస్క్రుతి, సంప్రదాయాలు, గ్రామాల్లోని అనుబంధాలను ఎంతో చక్కగా చూపించింది ఈ సినిమా.

Paruchuri Gopala Krishna interesting comments on balagam movie
Paruchuri Gopala Krishna

బలగం సినిమా చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ సినిమాని అభినందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బలగం సినిమా తీసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ.. ఒక సినిమాకు ఏది బలమో అదే బలగం సినిమాలో ఉండి. ఈ సినిమాని తీస్తున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని నిర్మాతలు దిల్ రాజు, హన్షిత, హర్షిత్ కూడా అనుకోని ఉండ‌క‌పోవ‌చ్చు. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్స్ అవసరంలేదు కథని నమ్ముకుంటే సినిమా హిట్ అవుతుందని ఈ చిత్రం నిరూపించింది.

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంది. వేణుని జబర్దస్త్ కమెడియన్ గా చూశాను. అతనిలో ఇంత గొప్ప రచయిత, డైరెక్టర్ ఉన్నాడని నేను ఊహించలేదు అని ప‌ర‌చూరి అన్నారు. .కామెడీ చేస్తున్న అబ్బాయి ఇలా గుండెలకు హత్తుకునే సినిమా చేయగలడు అనేది అస్స‌లు ఊహించలేము. ఇతను సినిమాలో చేసిన మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాని చూసి ముందునుంచే ఏడిపించకుండా ముందు నవ్వించి, కవ్వించి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించడంతో ఫుల్ స‌క్సెస్ అయ్యాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago