Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్ భేటి.. ఏం చ‌ర్చించారంటే..!

Pawan Kalyan : రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దీనికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు రెండు పార్టీలకు చెందిన మరో 14మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన‌డం జ‌రిగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో పాటు వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటం, రాష్ట్రంలోని అన్నీ వర్గాలు అభివృద్ది చెందాలనే మూడు తీర్మానాలను ఈ సమావేశంలో ప్రవేశ‌పెట్టారు. అలాగే జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడిగా చేపట్టబోయే భవిష్యత్‌ కార్యక్రమాలపై ఉమ్మడి కార్యాచరణను, ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించినట్లుగా లోకేష్, పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారుఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించిన తర్వాత టీడీపీ-జనసేన పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్.. ఇవాళ తొలిసారి ఉమ్మడి కమిటీ భేటీకి హాజరయ్యారు.

ఇవాళ్టి భేటీకి హాజరైన సందర్భంగా నారా లోకేష్ ఆయనకు టీడీపీ సభ్యుల్ని పరిచయం చేశారు. అలాగే నారా లోకేష్ కూడా స్వయంగా వెళ్లి జనసేన తరఫున కమిటీలో ఉన్న సభ్యుల్ని పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించాయి. ఇవాళ్టి భేటీలో జనసేన, టీడీపీ ఇరు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి తమవైపు నుంచి ప్రతిపాదనల్ని పరస్పరం పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు టీడీపీ ఈసారి తక్కువ సీట్లు ఆఫర్ చేస్తోందని, జనసేనను అస్సలు పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ జనసేన తరఫున ఇచ్చిన ప్రతిపాదనలు వీరి పొత్తుకు కీలకంగా మారాయి.

Pawan Kalyan and nara lokesh met for future events
Pawan Kalyan

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోవాలి..రాష్ట్రంలో జనసేన-టీడీపీ ప్రభుత్వం రావాలన్న ప్రధాన అజెండాతోనే నేటి సమావేశం జరిగిందన్నారు పవన్ కల్యాణ్. ఏపీలో 14ఏళ్ల బాలుడ్ని చంపిన వ్యక్తికి బెయిల్ వచ్చింది… కానిఅక్రమంగా అరెస్ట్ చేసిన 73ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడికి బెయిల్ రాకుండా ప్రభుత్వం టెక్నికల్‌గా అడ్డుపడుతోందని జనసేన పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ..అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టిన చంద్రబాబులో విశ్వాసం పెంచాలనే ఈ సమావేశాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలిపారు. అందుకే రాజమండ్రి నుంచి ఉమ్మడి కార్యాచరణతో పాటు భవిష్యత్ పోరాటం, ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్ర‌భుత్వం వచ్చాక రాజ‌మండ్రిలోనే తొలి బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago