Pawan Kalyan : వైసీపీ గూండాల‌కి పాఠాలు చెబుతానంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. వారాహి యాత్ర‌లో భాగంగా ప‌లు ప్రాంతాల‌లో పర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ నాయ‌కుల‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ ఏపీ రాజ‌కీయాల‌లో వేడి రాజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వారాహి యాత్రను ఆయన వైజాగ్ నుంచే ప్రారంభించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా వేరే మార్గంలో రావాలని పవన్‌కు పోలీసులు సూచించారు.ఎయిర్‌‌పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని చెప్పారు. ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని, అభివాదాలు కూడా చేయొద్దని స్పష్టం చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు మాత్రం అనుమతి ఇచ్చారు.

వారాహి యాత్రలో భాగంగా తొలి రెండు విడతల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించారు. మూడో విడతలో భాగంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. జగదాంబ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. 14వ తేదీ దాకా విశాఖలోనే పవన్ ఉండే అవకాశం ఉంది. 15, 16 తేదీల్లో గ్యాప్ ఇచ్చి.. 17 వ తేదీ నుంచి యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో భాగంగా సభ ను నిర్వహించనున్నారు. ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. మరో వైపు మాజీమంత్రి పడాల అరుణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

Pawan Kalyan comments on ysrcp leaders
Pawan Kalyan

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ గూండాల‌కి పాఠాలు చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌కి చేరుకున్న స‌మ‌యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో జనసేన వీరమహిళలు తమ అధినాయకుడికి హారతులు పట్టారు. సాయంత్రం నగరంలోని జగదాంబ సెంటర్ లో మూడో విడత వారాహి యాత్ర మొదలుకానుంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నట్లు పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago