Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌తో ద‌ద్ద‌రిల్లిన తాండూరు.. ఏం క్రేజ్ రా బాబు..!

Pawan Kalyan : తెలంగాణ ఎన్నిక‌ల‌లో భాగంగా ప‌వన్ క‌ళ్యాణ్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తూ ప‌లు ప్రాంతాల‌లో ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తాండూర్ పట్టణంకి వెళ్లారు. ఆయ‌న రాక‌తో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఎక్కడ చూసినా అభిమానులతో జనసేన, బిజెపి కార్యకర్తలతో నిండిపోయింది. పవన్ కళ్యాణ ప్రసంగం ఉద్వేగ భరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్. నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు పటేల్ జయశ్రీ, యు. రమేష్ కుమార్, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ. “అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలని, అవినీతి జరిగినప్పుడు ప్రశ్నించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు చేసుకున్న జనసేన అభ్యర్థుల గెలుపుకు అందరు సహకరించాలని” కోరారు.

అయితే ప‌వ‌న్ రాక‌తో జ‌న‌సేన కార్య‌క‌ర్తలు, అభిమానులు ఆయ‌నవైపుకి దూసుకొచ్చారు. దీంతో ఒక్క‌సారి ప‌రిస్థితి దారుణంగా మారింది. పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కొంత ఇబ్బందిగా మారింది. తాండూరులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ చూసి అంద‌రు షాక‌య్యారు. అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది” అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan craze in tandur see how fans reacted
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ రాకతో తాండూరులో అభిమానులు భారీగా తరలివచ్చారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని.. ఇక్కడ ప్రతి అణువులోనూ ఆశయం దాగి ఉంటుందన్నారు. దేనికీ భయపడకుండా.. కష్టానికి వెరవకుండా ముందుకు సాగే యువత తెలంగాణలోనే ఉందన్నారు. ఈ నేల, గాలి ఇచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతున్నానని అన్నారు. తనకు పదవులు మీద ఆశ, అధికారం మీద ప్రేమ అనేవి లేవని.. తనకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ప్రస్థానంలో 31 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా చేశారని.. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందుకు దూసుకువెళ్తోందన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago