Pawan Kalyan : మొద‌లైన ప‌వన్ మార్కు పాల‌న‌.. జ‌న‌సేన హ్యాపీ..!

Pawan Kalyan : పార్టీ పెట్టిన ప‌దేళ్ల‌కి ఎల‌క్ష‌న్స్‌లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా ప‌ద‌వి ద‌క్కించుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.ఆయ‌న ఇప్పుడు రాజ‌కీయాల‌లో త‌న‌దైన మార్క్‌తో దూసుకుపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఒకప్పుడు విమర్శించిన పెదవులే నేడు శభాష్ అనే విధంగా ప్రస్తుతం ఆ నియోజకవర్గ పని తీరుబట్టి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరసగా ఏ కొత్త కార్యక్రమం చేపట్టిన ఆ నియోజకవర్గంలోనే చేపట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలని కొందరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరికొందరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో 2500 మంది నిరుద్యోగులకు గ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అతి భారీ జాబ్ మేళా ఈనెల 24న పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలోని సుమారు 13వేలకు పైగా పంచాయతీలలో ఇవాళ (ఆగస్ట్ 23వ తేదీన) గ్రామసభలు జరిగాయి. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశంలోనే ఇదే తొలిసారి. అయితే కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు నేరుగా నిధులు కేటాయిస్తుంటుంది. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయితీలకు రూ.40,579 కోట్లు విడుదల చేసిన వాటిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టించింది. అయితే వాటి గురించి సోష‌ల్ ఆడిట్ నిర్వ‌హించేందుకు స‌మ‌ర్ధుడైన ఐపీఎస్ అధికారికి అప్పగించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారు.మ‌రోవైపు జ‌గ‌న్ హ‌యాంలో నిరుప‌యోగంగా ఉన్న స‌ర్పంచ్‌ల‌కి ఇప్పుడు పూర్వ వైభ‌వం రానుంద‌ని అంటున్నారు.

Pawan Kalyan creating his mark in andhra pradesh government
Pawan Kalyan

ప్రతీ గ్రామసభలో మౌలిక వసతులకు సంబందించి గ్రామస్తుల పిర్యాదులను, సమస్యలను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా రికార్డ్ చేయాలని, నిర్ధిష్టమైన కాలపరిధిలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. చెరువులలో చేపల పెంపకం, ఖాళీ భూములలో టేకు, పామాయిల్ తదితర ఫలసాయం అందించే చెట్ల పెంపకం ప్రోత్సహించి వాటి ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం సమకూర్చాలని పవన్‌ కళ్యాణ్‌ ప్రణాళికలు సిద్దం చేయిస్తున్నారు. రాష్ట్రంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించగలిగితే గ్రామాలు స్వయంసంవృద్ధి సాధించగలవని పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో కూడా కార్యాచరణ సిద్దం చేయిస్తున్నారు. రెండు మూడేళ్ల‌లో గ్రామాల‌లో స‌మూల‌మైన మార్క్ తీసుకొచ్చేవిధంగా ప‌వ‌న్ ముందుకు సాగుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago