Pawan Kalyan : నేను చావ‌డానికి కూడా సిద్ధ‌మే.. రానున్న రోజుల‌లో మ‌హా యుద్ధ‌మే జ‌రుగబోతుంది..!

Pawan Kalyan : రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటి అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌లు అంశాల గురించి చ‌ర్చించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని వారితో వ్యాఖ్యానించారు. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపా దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే అన్నారు. ఎన్నికల ఏడాదిలో అడుగుపెడుతున్నామని, రాష్ట్రంలో తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కేవలం తన చుట్టూ తిరిగితే నాయకులైపోరంటూ నేతలకు చురకలు అంటించారు ప‌వన్ క‌ళ్యాణ్‌. డబ్బు ఇచ్చి సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదని, వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలన్నారు. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తానని పవన్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అనే ఒక దుష్ట నాయకుడిపై మనం పోరాడాలంటూ వారికి సూచించారు. 2019 ఎన్నికల తరహాలో కాకుండా సర్వే నివేదికలు, అభిప్రాయ సేకరణ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని నేతలకు తెలిపారు. అలాగే ప్రత్యర్ధులు రెచ్చగొట్టారని మీరు రెచ్చిపోవద్దని నేతలకు పవన్ సూచించారు.

Pawan Kalyan emotional speech
Pawan Kalyan

మిమ్మ‌ల్ని నేను చనిపోమ‌నో లేదంటే డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌మ‌ని చెప్ప‌డం లేదు. మీ క‌న్నా ముందు నేను ఫైట్ చేస్తా. నేను పోయాక మీరు ఏం చేస్తార‌నేది ఆలోచించండి. జనసేనను బాధ్యతగా ఉండి జవాబు దారి తనంతో ముందుకు తీసుకువెళ్తానని.. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యమని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు.. ప్రభుత్వాన్నీ నిలదిస్తున్న పవన్‌పై ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. అయితే త‌నకి అందించిన మద్దతుకి రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

8 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

8 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

11 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

11 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

11 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

11 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

11 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 months ago