Pawan Kalyan Home In Pithapuram : పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలుసా..? దాని అద్దె ఎంతంటే..?

Pawan Kalyan Home In Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌ప్పుడు స్టార్ హీరో. ఆయన జ‌న‌సేన పార్టీ స్థాపించి రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా మారాడు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్‌ సక్సెస్ కాలేకపోయినా.. నటుడుగా మాత్రం సూపర్ సక్సెస్ అని చెప్పాలి. అయితే అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ.. పవన్ కళ్యాణ్‌కి మాత్రం భక్తులు ఉంటారు. ఆ భక్తిని లెక్కకట్టాలంటే ఎక్కాలు సరిపోవు. అది అభిమానమా? లేదంటే పిచ్చా.. ఇంకా ఇంకా ఏదైనా అనుకునే వాళ్లు అనుకుంటూనే ఉంటారు కానీ.. పవన్ కళ్యాణ్‌ని అభిమానించే ఫ్యాన్స్ మాత్రం.. అతని కోసం ప్రాణం పెట్టడానికైనా వెనకాడరు. తమ అభిమాన నాయకుడి కోసం గుడి కట్టడానికి రెడీగా ఉన్న ఫ్యాన్స్ ఆయ‌న ఏదైన అడిగిన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ప్రకటించేశారు కూడా. దానిలో భాగంగా.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉగాది నాడు పాలు కూడా పొంగించేశారు. అయితే పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న ఆ విశాలమైన నాలుగు అంతస్థుల భవనం.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఓదూరి నాగేశ్వరరావుది కావడం విశేషం. గొల్లప్రోలు మండలం చెబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన పంట పొలాల్లో ఈ ఇల్లు ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇదే ఇంట్లో ఉంటున్నారు. కాగా ఈ ఇంటి పవన్ కళ్యాణ్ కోసం ఉచితంగా ఇచ్చినట్టు తెలిపారు పవన్ అభిమాని ఓదూరి నాగేశ్వరరావు.

Pawan Kalyan Home In Pithapuram know how much rent it is
Pawan Kalyan Home In Pithapuram

అయితే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ఓదూరి నాగేశ్వరరావు. ‘ఈ ఇల్లు మొత్తం అర ఎకరంలో ఉంటుంది. దాదాపు 75 సెంట్లు ఉంటుంది. ఈ ఇల్లు ఇంత పెద్దగా నిర్మించడానికి కారణం ఏంటంటే.. సాఫ్ట్ వేర్ కంపెనీకి అనువుగా.. నివాసానికి బావుంటుందని ఇక్కడ నిర్మించాం. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే ఇల్లు కోసం చూస్తున్నారని తెలిసిందో.. మేం సార్ దృష్టిలో పెట్టాం. ఆయన తన టీంని పంపించారు.. మా వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ సార్.. ఎన్నిరోజులు ఉంటారో అన్ని రోజులూ ఫ్రీగా ఉండొచ్చు. అంతా ఆయన ఇష్టం. ఆయన ఎన్నాళ్లు ఉన్నా ఉచితంగా ఇస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ ఇంటి యజమాని ఓదూరి నాగేశ్వరరావు.ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష ఓట్ల మెజారిటీతో పక్కా గెలుస్తాడ‌ని కూడా చెబుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago