Pawan Kalyan : చంద్ర‌బాబుని తెగ పొగిడేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విస్తుపోయిన జ‌నం..

Pawan Kalyan : ప్ర‌స్తుతం జ‌న‌సేనాని వారాహి యాత్ర నాలుగో విడ‌త‌లో ప‌లు ప్రాంతాలు తిరుగుతుండ‌డం మ‌నం చూస్తున్నాం. నిన్న కృష్ణా జిల్లా.. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరం అంటూ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ అన్నారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని, కేసులకు భయపడబోనని పవన్‌ చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు.

జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం నిలప‌బోమ‌ని… పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం ఆగిపోదనీ.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా తమ ప్రణాళికలు ఉంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్ష అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్పుల వ‌ల‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్ అంధ‌కారంగా మారుతుంద‌ని చెప్పుకొచ్చారు. “జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదు. వచ్చేసిందని వైసీపీ నాయకులు దేశమంతా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నాను. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేనే స్వయంగా ప్రకటిస్తాను. నా తరఫున వైసీపీ నాయకులు, సలహాదారులు కష్టపడనక్కర్లేదు. దొంగచాటుగా ఏ పని చేయను. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది అని అన్నారు.

Pawan Kalyan praised chandra babu
Pawan Kalyan

నేను ఏ రోజు కూడా నా వల్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని మాట్లాడలేదు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆ పార్టీని తక్కువ అంచనా వేయను. టీడీపీ దగ్గర ఉన్న అనుభవానికి, జనసైనికుల యువరక్తం, పోరాట పటిమ తోడైతేనే వైసీపీని ఇంటికి పంపించగలం. చంద్రబాబు గారిపై పెట్టిన కేసులు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలవుతారని నమ్ముతున్నాను. జగన్ తన మీద 30కి పైగా కేసులు ఉన్నాయని, ఇతరుల మీద కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారు. . 2014లో ఏ పదవి ఆశించకుండా బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు ఇచ్చాను. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి జరగాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వ రావాలి. టీడీపీ నాయకులకు నా విన్నపం ఒక్కటే గతంలో మాట మాట అనుకున్నం మనసులో పెట్టుకోకండి. జనసేన కార్యకర్తలను ప్రేమగా పలకరించండి. మీ అనుభవానికి వాళ్ల పోరాట పటిమ తోడైతేనే వైసీపీని గద్దె దించగలం.చంద్ర‌బాబు గారికి చాలా అనుభవం ఉంది. ఆయ‌న ఏపీని మ‌రింత‌గా అభివృద్ధి చేయ‌గ‌లర‌ని భావించిన నా మ‌ద్దతు ఇచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago