Pawan Kalyan : వైర‌ల్ ఫీవ‌ర్ నుండి కోలుకున్న ప‌వ‌న్.. తిరిగి మంగ‌ళ‌గిరి చేరుకున్న జ‌న‌సేనాని

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్ధతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన విస్తతస్ధాయి భేటీ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా వారాహి యాత్రతో పాటు షూటింగ్స్ తోనూ బిజీగా గడుపుతున్న పవన్ కు అస్సలు విశ్రాంతి లేకుండాపోయింది. దీంతో తాజాగా వెన్నునొప్పితో కూడా బాధపడ్డారు. ఈ మధ్యే కృష్ణాజిల్లాలో వారాహి నాలుగోదశ యాత్రను ముగించుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన కీలక నేతలతో భేటీ అయ్యారు.

టీడీపీతో కలిసి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ కోసం ఐదుగురు నేతలతో కమిటీని కూడా ప్రకటించారు. దీనిపై తదుపరి చర్చలు రేపు నిర్వహించాల్సి ఉంది.అంతలోనే పవన్ అస్వస్ధతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ బారిన పడటంతో హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు. పీవర్ తగ్గగానే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ పరిస్థితులు, వారాహి విజ‌య‌యాత్ర ఐదో విడ‌త, జ‌న‌సేన‌,తెలుగుదేశం పార్టీల ఉమ్మ‌డి స‌మ‌న్వ‌య క‌మిటీలో చ‌ర్చించాల్సిన అంశాలు, రాష్ట్రంలో రైతాంగం స‌మ‌స్య‌ల‌పై చర్చించిన‌ట్టు స‌మాచారం.

Pawan Kalyan recovered from viral fever
Pawan Kalyan

మరోవైపు.. పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రకు లాంగ్ బ్రేక్ ప్రకటించారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో.. పవన్ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో.. పవన్ తన ఫ్యామిలీతో కలిసి అక్టోబర్ 17న ఫారిన్‌కు పయనం కానున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత మళ్లీ 26న తిరిగి రానున్నట్టు సమాచారం. కాగా.. ఫారిన్‌కు వెళ్లే ముందే.. పార్టీ కార్యక్రమాలు అన్ని చక్కబెట్టాలని బిజీ షెడ్యూల్ వేసుకున్న పవన్‌కు.. సడెన్‌గా వైరల్ ఫీవర్ రావటంతో.. అన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago