Pawan Kalyan Satyagrahi : ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌త్యాగ్ర‌హి ఎందుకు ఆగిందో ఇప్ప‌టికి తెలిసింది…!

Pawan Kalyan Satyagrahi : ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌పై అభిమానుల‌లో ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా ప‌వ‌న్ త‌ర్వాతి సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉంటారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్‌లో చాలా సినిమాల‌ని మ‌ధ్య‌లోనే ఆపేశారు. వాటిలో స‌త్యాగ్ర‌హి ఒక‌టి. 2003లో పవన్ దర్శకత్వంలో, ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీసూర్య మూవీస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత ఏ.ఎమ్. రత్నం ‘సత్యాగ్రహి’ సినిమాను అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు.

దర్శకరత్న దాసరి క్లాప్, విక్టరీ వెంకటేష్ కెమెరా స్విఛ్చాన్, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనివార్య కారణాలతో సినిమాను పక్కన పెట్టేశారు. అస‌లు ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు. నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయని, స్క్రిప్టు సరిగ్గా రాలేదని, బడ్జెట్ ఎక్కువైందని ఇలా అనేక ర‌కాలుగా ప్ర‌చారాలు అయితే సాగాయి. తాజాగా ఈ విషయమై నిర్మాత ఎఎమ్ రత్నం మాట్లాడారు. “జాని చిత్రం రిజల్ట్ చూసాక, పవన్ చాలా నిరాశపడ్డారు.

Pawan Kalyan Satyagrahi movie finally the reason revealed
Pawan Kalyan Satyagrahi

ఆయన డైరక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని , అందుకే సత్యాగ్రహి చిత్రంపై మా డబ్బుని రిస్క్ చేయటానికి ఇష్టపడలేదు. దాంతో ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేసారు అని ఏఎం ర‌త్నం అన్నారు. ఇక దాదాపు 18 ఏళ్ల తర్వాత పవన్ ‘సత్యాగ్రహి’ గురించి గుర్తు చేసుకున్నారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ కాలంలో జరిగిన ఎమర్జెన్సీ ఉద్యమం నుండి స్పూర్తి పొంది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేద్దామనుకున్న సినిమా.. సినిమాలో నటించడం కంటే కూడా ఇంకా టాక్ నడుస్తుండడం మరింత సంతృప్తినిస్తుంది అంటూ పవన్ ఆ మ‌ధ్య‌ ట్వీట్ చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago