Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఆప‌డానికి ఇంత మంది పోలీసులు దిగారా..?

Pawan Kalyan : అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవ‌డం మ‌నం చూశాం. ఆయ‌న విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసుల వైఖరికి నిరసనగా పవన్‌ రోడ్డుపై పడుకొని నిరసన తెలపడంతో హైటెన్షన్‌ నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్‌.. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు.

మధ్యాహ్నం ప్రత్యేక విమానం టేకాఫ్ కాకుండా అధికారులు అడ్డుపడ్డారు. దీంతో రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అభిమానులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అభిమానుల ఆందోళనతో పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు ముందుకు వదిలారు. పవన్‌ కళ్యాణ్‌‌తో పాటు, మనోహర్‌ను కూడా చంద్రబాబును పరామర్శించేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరు పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డంగా పెట్టిన బారీకెడ్లును నెట్టివేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు జనసేనా కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు.

Pawan Kalyan stopped from meeting chandra babu
Pawan Kalyan

పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నడిచి మంగళగిరి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో పవన్ కల్యాణ్ వాహనం దిగి నడక మొదలు పెట్టారు. పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేసారు. అనుమంచిపల్లి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. జాతీయ రహదారికి అడ్డంగా పవన్ కళ్యాణ్ పడుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలని రప్పించ‌డంతో కొంత ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఈ రోజు ఏపీ బంద్ ఉండ‌గా, దానికి కూడా ప‌వ‌న్ క‌ళ్యాన్ సంఘీభావం తెలియ‌జేశారు. కాగా, రిమాండ్‌ను తిరస్కరించాలన్న చంద్రబాబు వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago