Pawan Kalyan : ఆనాడు నువ్వు చెప్పిందే కదా జ‌గ‌న్ ఇది.. గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాలు రోజురోజుకి హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఒక‌వైపు జ‌న‌సేన టార్గెట్ చేస్తుండ‌గా, మ‌రోవైపు చంద్ర‌బాబు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జగన్ పాలన లో వైఫల్యాలను విడమరచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు జ‌న‌సేనాని. అయితే ఈ విమర్శలకు ఎలా చెక్ పెట్టాలో అర్థంకాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఇటీవల వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వాలెంటర్లు డేటా చోరీకి పాల్పడుతున్నారని, ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించే హక్కు వాలెంటర్లకు ఎవరు అధికారం ఇచ్చారని, వాలెంటరీ వ్యవస్థకు ఎవరు బాస్ అంటూ తీవ్ర స్థాయిలో ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెల‌సిందే.

ప్రజల వ్యక్తిగత డేటా ను సర్వేలు అంటూ, కుటుంబ లెక్కలు అంటూ ఇలా ప్రతి చిన్న అంశానికి సేకరిస్తున్నారు వాలెంటర్లు.ఇలా సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తోందనేది పవన్ లేవనెత్తున్న ప్రశ్న. అయితే ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కి వైసీపీ నేత‌లు ఎవ‌రు స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌డం లేదు. సి‌ఎం జగన్ కూడా తాజాగా జరిగిన మంగళగిరి సభలో వాలెంటరీ వ్యవస్థపై పొగడ్తలు కురిపించారే తప్పా, పవన్ చేసిన విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.పైగా పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం గమనార్హం. వాలెంటరీ వ్యవస్థపై పవన్ లేవనెత్తిన అంశాలతో జగన్ డిఫెన్స్ లో పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.

Pawan Kalyan strong counter to cm ys jagan on data
Pawan Kalyan

గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు డేటా చౌర్యంపై మండిప‌డ్డ వీడియో వైర‌ల్ అవుతుంది. ఆధార్ సంబంధించిన డీటైల్స్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, ఓట‌ర్ డీటైల్స్ వేరే ప్రైవేట్ వ్య‌క్తి ద‌గ్గ‌ర ఉంటే అది పెద్ద క్రైమ్ అని జ‌గ‌న్ అన్నారు. మ‌రి ఆ రోజు అన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై అన్ని ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్ ఈ రోజు చేసిందేంటి.. వాలంటీర్స్ పేరుతో ప్ర‌జ‌ల డేటాని చౌర్యం చేస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో వ్యతిరేకత మొద‌లైంది. డేటా లీకేజీ అంశంపై పవన్ కల్యాణ్ నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడం మొదలుపెట్టిన ప్రజలు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైసీపీపై తిరుగుబాటు మొదలు పెడతారు అని జ‌న‌సైనికులు అంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago