Pawan Kalyan Vs Roja : ద‌మ్ముంటే వారాహిని ఆపి చూడండి.. వైసీపీ నాయ‌కుల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్..

Pawan Kalyan Vs Roja : కత్తిపూడిలో నిర్వహించిన వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే.. ఆయనకు ఫోన్లో చాలా మనస్పూర్తిగా అభినందనలు చెప్పి.. మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి మాట్లాడను.. మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పానని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అయితే ఆయ‌న మాత్రం తన ఇంట్లొ ఉన్న 4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచ్ఛం, నీచం లేకుండా తిట్టారని.. అంత తప్పు ఏమి చేశాను? ప్రజల కోసం పనిచేయడం తప్పా? అని పవన్ ప్రశ్నించారు.పోరాటం చేయనిదే మార్పు రాదని, ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఉవ్విళ్లూరు ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలని అన్నారు.

నేను నా వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను… ఈ కూసే గాడిదలను రమ్మను…. నా వారాహిని ఆపండి… నేనేంటో అప్పుడు చూపిస్తా” అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని తనపై కక్షకట్టి పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడించారని గుర్తు చేశారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలని సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.

Pawan Kalyan Vs Roja comments on varahi yatra
Pawan Kalyan Vs Roja

18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు తెచ్చుకున్న యువతకు ఒక్కటే విన్నపం.. ఒక మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మ బలిదానం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మనం గుర్తు ఉంచుకుని, ఆయన ఆశయాల కోసం పనిచేయాలి. నేను కేవలం సంపాదన కోసం సినిమాలు చేయడం లేదు. పార్టీని నడపడానికి డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేస్తున్నాను. సినిమా టిక్కెట్స్ విష‌యంలో కూడా చాలా దిగ‌జారిన వ్య‌క్తి జ‌గ‌న్. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్లాస్ వార్ అంటే పేద, ధనిక మధ్య వ్యత్యాసం. జగన్‌తో పోలిస్తే నేను చాలా తక్కున. ఆయన మీద క్లాస్ వార్ నేను చేయాలి. వేల కోట్లు సంపాదన, మైనింగ్ కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న వ్యక్తి క్లాస్ వార్ అంటే ఎలా అని పవన్ వ్యాఖ్యానించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago