Posani Krishna Murali : ప‌వ‌న్ గెలిచే వాడే.. రూ.15 కోట్లతో టీడీపీనే ఓడించింద‌న్న పోసాని..

Posani Krishna Murali : వారాహి విజ‌యాత్ర స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వైసీపీ నాయ‌కులపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో వారు కూడా తిరిగి అటాక్ చేస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం పోసాని కృష్ణ ముర‌ళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వాలంటీర్ల పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను త‌ప్పు ప‌ట్టిన పోసాని ..ఆ మాటలు చంద్రబాబు నుంచి వస్తున్న మాటలుగా పేర్కొన్నారు. వాళ్ళ ట్రాప్ లో పడి అందరికి దూరం అయ్యావు అని అన్నారు పోసాని. చంద్రబాబు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ఆడుతున్నారని.. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వల్ల తన కుటుంబానికి గతంలో జరిగిన అవమానాలను పవన్ ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యేక హోదా అవసరంలేదని, మరోసారి కావాలని డిమాండ్ చేశారని.. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏవైపు ఉండాలో అర్థంకాని పరిస్థితిలో ఉండిపోయిందని పోసాని గుర్తుచేశారు. శ్రీ కృష్ణుడు గోపిక‌లతో సరసాలు ఆడినట్లు చంద్రబాబు, ఆయ‌న‌ కొడుకు లోకేష్ సరసాలు ఆడాడు. అప్పుడు పవన్ అడగలేదని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారుని..జగన్ ఏం పాపం చేసారని పోసాని ప్రశ్నించారు. చంద్రబాబు పొరపాటున కూడా పవన్ ను సీఎం చేయరని పోసాని అన్నారు.

Posani Krishna Murali comments on pawan kalyan
Posani Krishna Murali

అస‌లు భీమవరంలో రూ 15 కోట్లు ఖర్చు చేసి టీడీపీ నేతలే పవన్ ను ఓడించారని పోసాని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, ఆయన కొడుకు పుణ్యమా అని డేటా చోరీ జరిగిందన్నారు. పవన్ ను చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా గెలవనీయరని పోసాని జోస్యం చెప్పారు. ఏదైనా సమాచారం ఉంటే నిఘా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెబుతారని , ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవర‌ని ఆయ‌న‌కు చెబుతార‌ని పోసాని ప్రశ్నించాడు. పవన్ కు విలువలు ఉంటే వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్ సీఎంగా ఉంటారని పోసాని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్‌కి ప్ర‌జ‌ల ఆశీర్వాదం లేదు కాబ‌ట్టి వార్డ్ మెంబ‌ర్ కూడా కాలేడ‌ని అన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago