Posani Krishna Murali : చిరంజీవిపై పోసాని ఫైర్.. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇప్పుడెలా అడుగుతావ్ అంటూ ప్ర‌శ్న‌లు..

Posani Krishna Murali : ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్ర‌చార స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆయా పార్టీలు ప్ర‌చారం స్పీడ్ పెంచాయి.ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి గెల‌వాల‌నే క‌సితో ఉన్నారు.ఆయ‌న కోసం మెగా హీరోల‌తో పాటు శ్రేయోభిలాషులు కూడా వ‌చ్చి ప్ర‌చారాలు చేస్తున్నారు. రీసెంట్ చిరంజీవి కూడా ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేసి ప‌వ‌న్‌కి త‌న మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. చిరు స‌పోర్ట్ చేసిన త‌ర్వాత ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. ఈ క్ర‌మంలో వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. చిరంజీవి తీరుపై మండిపడ్డారు. రాజకీయాలు నాకు సరిపోవంటూ వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జనసేనకు ఓటు వేయమని ఎలా కోరుతారంటూ నిలదీశారు. ప‌వన్ కళ్యాణ్‌కు గెలిపించమని చిరంజీవి ఎలా చెబుతారు. ప్రజలంటే ఆయనకు చాలా చీప్ అభిప్రాయం.. వాళ్లేం చేస్తారులే అనుకుంటారు. ఆయన ఓ వెరీగుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో టాప్ హీరో. చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించారా? ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో అయినా కూర్చున్నారా. ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేద్దాం. ఓట్లు వేయకపోతే వెళ్లిపోదాం అనుకున్నారు. ఆయన దృష్టిలో అది బిజినెస్.

Posani Krishna Murali sensational comments on chiranjeevi for supporting pawan kalyan
Posani Krishna Murali

18 మంది ఎమ్మెల్యేలను మీ దారి మీరు చూసుకోమన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. మరి అక్కడైనా ఉన్నారా?” అని నిలదీశారు. “రాజకీయం నాకు సెట్ కాదు. వద్దని వెళ్లిపోయారు. తప్పుతెలుసుకుని వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ ఇప్పుడెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు. చిరంజీవి జీవితంలో మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లొచ్చా? అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు కాపు యువత బలయ్యారన్న పోసాని.. మళ్లీ ఇప్పుడు జనసేన తరుపున ప్రచారం చేయడానికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. రూపాయి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి నగదు జమ జరుగుతోందని, జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చారు పోసాని.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago