Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

Raghurama Krishnam Raju : వైసీపీ నుంచి గెలిచి ఆరునెలలకే ఆ పార్టీతో విభేదించి ఢిల్లీకే పరిమితమైన రెబెల్ ఎంపీ రఘురామరాజు కొన్నాళ్లుగా ఢిల్లీకే ప‌రిమితం అయ్యారు. అక్క‌డ నుండే ఆయ‌న రాజ‌కీయం న‌డుపుతున్నారు. అయితే రీసెంట్‌గా ఆయ‌న ఏపీలో అడుగుపెట్టారు. నాలుగేళ్ల విరామం తర్వాత రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం రోడ్డు మార్గంలో స్వస్ధలం భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్ధాయికి చేరడానికి కారణమైన సీఎం జగన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. గతంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో పోలీసులు తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని ఊహించి హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు పోలీసులకు నిబంధనల మేరకు వ్యవహరించాలని పక్కాగా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎంపీకి ఇవ్వాల్సిన భద్రత కల్పించాలని ఆదేశించింది. దీంతో రఘురామ ఎంట్రీకి ఆటంకాలు తొలిగాయి. అయినా రాజమండ్రి ఎయిర్ పోర్టులో రఘురామ ఎంట్రీ ఇచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగింది. రఘురామరాజు ఎయిర్ పోర్టు నుంచి బయిటికి రాగానే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే రఘురామ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటికి రావడం, ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం జరిగిపోయాయి.

Raghurama Krishnam Raju sensational comments on cm ys jagan
Raghurama Krishnam Raju

ఈ సందర్భంగా తనకు ఈ నాలుగేళ్ల పాటు మద్దతు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు తనను ఈ స్ధాయికి తీసుకొచ్చినందుకు జగన్ కు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. భోగినాడు సొంత నియోజ‌క వ‌ర్గంలోకి వ‌చ్చిన ర‌ఘురామ తొడ కూడా కొట్టారు. చాలా మంది బౌన్సర్స్ న‌డుమ ఆయ‌న రావ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. అయితే ఈ సారి ఆయ‌న ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తాడు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago