Ramabhadracharya Swamy : ఆ అంధుడి వ‌ల్ల‌నే అయోధ్య రామ మందిర నిర్మాణం సాధ్య‌మైందా..?

Ramabhadracharya Swamy : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జ‌రిగింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. సోమవారం మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణలు, వేలాదిమంది ప్రముఖల జైరామ్ నినాదాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నవరి 22, సోమవారం మధ్యాహ్నం.. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.ఆ రోజు దేశమంతా ఎక్కడ చూసిన రామ నామం, అయోధ్య పేర్లే వినిపించాయి.

అయితే మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి గురించి ఎక్కువగా వైర‌ల్ అయింది.. ఆయన వల్లే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. దాని వల్ల నేడు మందిర నిర్మాణం సాధ్యం అయ్యింది. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే.. ఆయ‌న పేరు రామభద్రాచార్యస్వామి. ఎన్నో ఏళ్లగా ముడి పడని రామ మందిర నిర్మాణానికి కారకుడు అయ్యాడు. ఎన్నో ఏళ్లగా కోర్టులో ఉన్న అయోధ్య రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన తీర్పు వల్లనే శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట సాధ్యమైంది. రామభద్రాచార్యస్వామి వారు అంధులై ఉండి కూడా అయోధ్య నిర్మాణానికి కారకులు కావడం విశేషం. ఏళ్ల పాటు కోర్టులో సాగుతున్న అయోధ్య శ్రీ రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన సాక్ష్యం వల్లనే రామ మందిర నిర్మాణం జరిగింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో జడ్జి వేదాలలో శ్రీ రామ గురించి ఎక్కడ ఉందో చెప్పమని అడగగా అప్పుడు రామభద్రాచార్యస్వామి వారి ఋగ్వేద మంత్రాలు చదువుతూ వాటి భాష్యం చెబుతూ.. శ్రీ రామ గురించి అందరికీ తెలియజేశారు.

Ramabhadracharya Swamy is the only one who helped building ayodhya temple
Ramabhadracharya Swamy

అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి మహిమ, సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.ఋగ్వేద మంత్రాలకు పద వాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం.. మంత్ర రామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది.

దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుంచి సీతా మాతా భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నింటిని రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా విన్నవించారు. రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు.. హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా.. మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. దాంతో ఓ లాయర్‌.. రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకు వచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికి.. ఆయన అనర్గళంగా ఆయన ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథను వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టులో ఉన్న వారంతా నివ్వెరపోయారు. రాముడిని గెలిపించడంలో రామభద్రాచార్య స్వామి కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago