Akunuri Murali : స్మిత స‌బ‌ర్వాల్‌కి ఆకునూరి అదిరిపోయే పంచ్.. వ‌దిలిపెట్టొద్దంటూ ట్వీట్

Akunuri Murali : తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక చాలా మంది అధికారులు రాజీనామా చేస్తున్నారు. మ‌రి కొంద‌రు కేంద్ర స‌ర్వీసుల‌కి వెళుతున్నారు. అయితే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను ఉద్దేశించి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే ఐఏఎస్ అధికారులను పంపకుండా చర్యలు తీసుకోవాలని త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. ఇలాంటి అధికారులను కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.

ఏం తప్పులు చెయ్యకపోతే భుజాలు తడుముకోడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘దేశం మొత్తంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ ఆకునూరి రాసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నెట్‌వర్క్స్‌ను వాడుకొని, ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయ్యింది అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆకునూరి ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. దీనిపై రేవంత్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

retired ias Akunuri Murali sensational comments on smitha sabarwal
Akunuri Murali

తాను కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నానన్న వార్తలపై.. స్మిత సబర్వాల్ స్పందించారు. తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎటువంటి బాధ్యత అయిన స్వీకరిస్తానని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మంత్రి సీతక్కను స్మితా సభర్వాల్ కలిశారు. ఇక ఆకునూరు మురళి గురించి తెలంగాణ జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్‌ హయాంలో ఐఏఎస్‌గా వాలెంటైర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకొని.. బీఆర్ఎస్ సర్కార్ మీదే యుద్ధం ప్రకటించిన వ్యక్తి. ఆయన గత కొంతకాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో అణిచివేతలకు గురయ్యానని ఆరోపిస్తూ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago