Richa Gangopadhyay : అంత టార్చ‌ర్ పెట్టినందుకే రిచా టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పిందా..?

Richa Gangopadhyay : రిచా గంగోపాధ్యాయ్.. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని తెగ అల‌రించింది. రవితేజ మిరపకాయ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. లీడర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమెకు మంచి గుర్తింపు అందించింది మాత్రం మిరపకాయ్ సినిమా అనే చెప్పాలి.. హరిష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన సినిమాలో ఆమె ట్రెడిషనల్ అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. న్యూఢిల్లీకి చెందిన ఈమె ఉన్నత చదువుల కోసం ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడి వాతావరణంకు బాగా క‌నెక్ట్ అయింది.

యూఎస్ఏ లో ఉన్న‌ప్పుడే మిస్ ఇండియాకి కూడా పోటీ చేసింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సొంతం చేసుకుంది. అయితే మొదట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది. 2010లో రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ సినిమాతో మొదటిసారి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఓ సమస్య రిచాని మరీ ఇబ్బంది పెట్టిందట. ఒక సినిమా చేయాలంటే కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి. అలాంటి విష‌యాల‌లో రిచా గంగోపాధ్యాయ చాలా బాధ‌ప‌డింద‌ట‌. ఈ క్ర‌మంలోనే నాగార్జున సరసన నటించిన భాయ్ సినిమా తర్వాత సర్దేసుకొని అమెరికాకి వెళ్లిపోయింది.

Richa Gangopadhyay that is the reason for her film career close
Richa Gangopadhyay

2019లో పెళ్లి చేసుకున్న రిచా ఇప్పుడు ఓ బిడ్డకి తల్లిగా ఆనందకరమైన జీవితం గడుపుతోంది. మొదటి సినిమా అనంతరం రిచా గంగోపాధ్యాయ త్వ‌రగానే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంది. నాగవల్లి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మిరపకాయ్ సినిమా మంచి హిట్ అయింది. అనంతరం ఆమెకు తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఇక మరోసారి రవితేజతో సారొచ్చారు అనే సినిమా చేసింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. రిచా 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నెటిజ‌న్స్‌ని అలరిస్తూ ఉంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago