Sajjala Ramakrishna Reddy : ఆధారాల‌తో దొరికాడు కాబ‌ట్టే అరెస్ట్.. క‌క్ష సాధింపు కాద‌న్న స‌జ్జ‌ల‌..

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబు అరెస్ట్ ఏపీలో ఎంత ర‌చ్చ‌గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. చంద్ర‌బాబు అరెస్ట్‌పై టీడీపీ నాయ‌కులతో పాటు ప‌లువురు బీజేపీ నాయ‌కులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు.. చంద్రబాబు అరెస్టు వెనక వైసీపీ ఎలాంటి కుట్రకూ పాల్పడలేదన్న ఆయన.. దర్యాప్తు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడిపై బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ పోలీసులు ఇవాళ ఉదయం నంద్యాలలో ఆయన్ని అరెస్టు చేశారని తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ వెన‌క ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని స‌జ్జ‌ల‌ అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఈ స్కాం జరిగిందన్న స‌జ్జల, దీనిపై ఆయన ఎందుకు నిస్పక్షపాత దర్యాప్తు జరిపించలేదని నిలదీశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రజా సొమ్మును అక్రమ మార్గాల్లో దోచుకున్నారని అన్నారు. రెండేళ్ల కిందటే CID దీనిపై కేసు నమోదు చేసిందని వివరించారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరులు లేదని చంద్రబాబు అనడాన్ని సజ్జల తప్పుపట్టారు. ఎఎఫ్ఐఆర్‌లో అన్నీ ఉండాలని లేదన్న ఆయన.. చంద్రబాబు.. దబాయిస్తున్నారని అన్నారు. 2017, 2018లోనే పూణెలో జీఎస్డీ విచారణలో షెల్ కంపెనీలకు మనీ మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు.

Sajjala Ramakrishna Reddy responded on chandra babu arrest
Sajjala Ramakrishna Reddy

స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందనేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు తాము నమ్ముతున్నామని సజ్జల అన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పిన సజ్జ‌ల ప్రజలను చంద్రబాబు తప్పుదారి పట్టించాలని చూసినా, నిజాలు ప్రజలకు తెలుస్తాయి అన్నారు.రాత్రికి రాత్రి సీఐడీ వెళ్లి అరెస్ట్ చేయలేదని.. స్కామ్‌‌పై రెండేళ్ల విచారణ జరిపి ఆధారాలతోనే అరెస్ట్ చేసిందని తెలిపారు. అసలు విషయం చెప్పకుండా టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు సజ్జల.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago