Sridhar Babu : అసెంబ్లీలో త‌ల‌సాని వ‌ర్సెస్ శ్రీధ‌ర్ బాబు.. బీఆర్ఎస్ నాయ‌కుల‌కి చెమ‌ట‌లు ప‌ట్టించారుగా..!

Sridhar Babu : ప్ర‌స్తుతం అసెంబ్లీలో రాజ‌కీయాలు ఎంత రంజుగా సాగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సభలో కోరం లేదంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోరం లేకుండా సభను పెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హరీశ్ రావు కడియం శ్రీహరి అన్నారు. అయితే, పది శాతం మంది సభ్యులు ఉంటే కోరం సరిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అన్నీ తెలిసినా హరీశ్ రావు బుల్డోజ్ చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ తరపున సరైన సంఖ్యలో సభ్యులు ఉన్నారని చెప్పారు.

తాము పథకాలు అమలు చేయొద్దని బిఆర్‌ఎస్ వాళ్లు కోరుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా కడియం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు రాకముందే మరో రెండు పథకాలు అమలు చేస్తామని వివరించారు. బిఆర్‌ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చిన తరువాత హామీలను అమలు చేస్తామన్నారు. ఇచ్చి ప్రతీ హామీ అమలు చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం చర్చ పెడుదామనని, దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్లు ఎఒయులో కుదుర్చుకున్నామని బాబు స్పష్టం చేశారు.

Sridhar Babu vs talasani in assembly what happened
Sridhar Babu

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సభ నిర్వహణకు తాము సహకరిస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ సభ్యులను తాము అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ… బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం సభలో లేరని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో గోరంతను కొండంత చేయొద్దని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని అన్నారు. కాళేశ్వరం ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయని… నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago