Surya Kumar Yadav : జింబాబ్వే అమాయ‌క‌త్వం.. సూర్య కుమార్ యాద‌వ్ ఔట్ అయినా.. అప్పీల్ చేయ‌లేదు.. ఎవ‌రూ గుర్తించ‌నేలేదే..!

Surya Kumar Yadav : ప్ర‌స్తుతం టీ 20 ప్ర‌పంచ క‌ప్ హోరా హోరీగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఇండియా సెమీస్‌కి చేరింది. సెమీస్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. అయితే ఇండియా సెమీస్‌కి చేరుకోవ‌డంతో కోహ్లీ తో పాటు సూర్యకుమార్ యాదవ్ పాత్ర కూడా ఉంది. ఆయ‌న కొన్ని అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో జింబాబ్వేపై ఆడిన ఇన్నింగ్స్ కూడా ఒక‌టి. సూర్యకుమార్ యాదవ్ ప్ర‌స్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టీ 20 వరల్డ్ కప్ 2022 లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతూ, మంచి స్కోర్లు నమోదు చేస్తున్నాడు.

ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతను ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 225 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 75 కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచ కప్‌లో 193 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. జింబాబ్వేపై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో తుఫాను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 25 బంతుల్లో 61 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చివరి ఐదు ఓవర్లలో శివతాండవం చేశాడు.

Surya Kumar Yadav got out for that delivery zimbabwe not noticed
Surya Kumar Yadav

సూర్య సునామి ఇన్నింగ్స్‌కి ముందు జింబావ్వేకి అద్భుత‌మైన అవ‌కాశం ద‌క్కింది. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ చివరి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ అవుట్‌ అయ్యాడు. ముజారబానీ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ చివరి బంతికి స్కూప్‌ షాట్‌ ఆడబోగా, అది మిస్ కావ‌డంతో బంతి వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. అయితే ముజార‌బానీకి బంతి బ్యాట్ ని త‌గిలిన‌ట్టు అనిపించ‌గా,చిన్న అప్పీల్ చేశాడు. కీప‌ర్ కూడా త‌గ‌ల‌లేద‌న్న‌ట్టే ఉండ‌డంతో అంపైర్‌ కూడా స్పందించలేదు. కానీ రీప్లేలో మాత్రం బంతి.. బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. వారి అమాయకత్వంతో సూర్య ఔట్ అయ్యే ప్ర‌మాదం నుండి త‌ప్పించుకోవ‌డంతో చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 21 పరుగులు పిండుకున్నాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 years ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 years ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 years ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 years ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 years ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 years ago