Taraka Ratna Last Photo : తార‌క‌ర‌త్న‌తో చివ‌రిసారి దిగిన ఫొటోను షేర్ చేసిన అలేఖ్య రెడ్డి.. క‌న్నీళ్లు తెప్పిస్తోంది..

Taraka Ratna Last Photo : ఫిబ్ర‌వ‌రి 18న నంద‌మూరి తార‌క‌ర‌త్న గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. చిన్న వ‌య‌స్సులో ఆయ‌న క‌న్నుమూయ‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించి వేసింది. ఇప్ప‌టికీ ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆ విషాదం నుండి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. తారకరత్నను కోల్పోవడం ఆయన కుటుంబానికి పెద్ద లోటు అని చెప్పుకోవాలి. అయితే భర్త మరణంతో తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనవుతోంది.తన భర్తతో గడిపిన ఆ క్షణాలను మరచిపోలేకపోతున్న‌ అలేఖ్య రెడ్డి… కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ఓదార్చినా కూడా కంటతడి పెట్టుకోకుండా ఉండ‌లేక‌పోతుంది. ఈ నేపథ్యంలో తన భర్త తారకరత్న చివరి జ్ఞాపకాన్ని పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య రెడ్డి.

తాజాగా అలేఖ్య రెడ్డి చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ అందరి హృదయాల్ని కలచి వేసే విధంగా ఉంది. తారకరత్నతో చివరగా దిగిన ఫోటోని అలేఖ్య సోషల్ మీడియాలో పంచుకుంది. చివరగా వారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారక రత్న, అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో ఫోటో దిగారు. ఆ ఫోటోనే అలేఖ్య అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోకి కామెంట్‌గా ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా గుండె ముక్కలవుతోంది. ఇదంతా కల అయితే బావుండు. నీ గొంతుతో అమ్మ బంగారు అంటూ లేపవా.. అంటూ తీవ్రమైన బాధతో ఈ పోస్ట్ పెట్టింది అలేఖ్య రెడ్డి. దీంతో ఈ పోస్ట్ చూసి నెటిజన్లు ఆమెకు మనో దైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు.

Taraka Ratna Last Photo shared by alekhya reddy
Taraka Ratna Last Photo

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించి వేస్తుంది. కొన్నేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు తారాకరత్న- అలేఖ్య రెడ్డి లవ్ స్టోరీ సినిమాల్లో మాదిరిగానే జ‌రిగింది.. మొదట ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ నెలకొని ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం లభించలేదు.అయిన‌ప్ప‌టికీ వారు 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో కొంత మంది బంధు మిత్రలు సమక్షంలో ప్రేమ వివాహాం చేసుకున్నారు తారకరత్న. అప్పటినుంచి తన భార్యతో వేరుగా ఉన్నారు తార‌క‌ర‌త్న‌. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago